Dry Skin : చలికాలంలో బాధించే పొడి చర్మం సమస్యను సహజ చిట్కాలతో తొలగించుకోండి!

చర్మం పొడిబారడంతో బాధపడేవారికి పాలు మంచి ఎంపిక. పాలలో కాటన్ బాల్‌ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడే లక్షణాలు పాలల్లో ఉన్నాయి.

Dry Skin : చలికాలంలో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య పొడి చర్మం. ఈ కాలంలో చర్మం మాయిశ్చరైజర్ తగ్గిపోవటం వల్ల పొడిబారిపోతుంది. శీతాకాలంలో చాలామందిలో చర్మం, పెదాలు పొడిబారడంతో పాటు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. అంతేకాదు.. మోకాళ్లు, మోచేతులు.. వంటి భాగాల్లో చర్మం కందిపోయినట్లుగా నల్లగా, గరుకుగా మారిపోతుంటుంది. పొడి చర్మం సమస్యను తగ్గించుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల క్రీములు వాడినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి సందర్భంలో సహజ పద్దతుల ద్వారా మనం పొడి చర్మం సమస్యను పరిష్కరించుకోవచ్చు.

పొడిచర్మం సమస్యకు పరిష్కారాలు ; 

కలబంద: మీ తోటలో పెంచే ఈ కలబంద మొక్క మీ చర్మం పొడిబారడటం నుంచి సహాయపడుతుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్‌లు ఉన్నాయి, ఇవి చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి.

కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో అనేక చర్మ సమస్యలను పరిష్కరించే గుణాలు ఉన్నాయి. కాబట్టి.. కొబ్బరి నూనెను పొడి చర్మంపై ఉపయోగించవచ్చు, ఇది చర్మానికి వాంఛనీయ స్థాయి తేమను అందిస్తుంది. చర్మం మృదువుగా , కోమలంగా మారేందుకు సహాయపడుతుంది.

పాలు: చర్మం పొడిబారడంతో బాధపడేవారికి పాలు మంచి ఎంపిక. పాలలో కాటన్ బాల్‌ను నానబెట్టి ముఖమంతా అప్లై చేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మ నూనెలను చెక్కుచెదరకుండా ఉంచుతూ చర్మానికి తేమను అందించడంలో సహాయపడే లక్షణాలు పాలల్లో ఉన్నాయి.

ఓట్స్: ఓట్స్ ని పొడి చేసుకొని అందులో నీరు కలపండి. తర్వాత మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. పేస్ట్ మీ చర్మంలో తేమను పోకుండా అంతే ఉండేలా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సబ్బుల ఎంపికలో ; శీతాకాలంలో చర్మం పొడిబారడానికి మనం స్నానానికి ఉపయోగించే సబ్బులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ కాలంలో గ్లిజరిన్‌ ఆధారిత సబ్బుల్ని ఉపయోగించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే మీ చర్మతత్వాన్ని బట్టి మీకు ఏ సబ్బు మేలు కలిగిస్తుందో కొనే ముందు ఓసారి లేబుల్‌ని పరిశీలించడం లేదంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 

ట్రెండింగ్ వార్తలు