Heart Disease : గుండె జబ్బులు రాకుండా నివారించటం ఎలాగంటే?

రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండాలంటే రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం ముఖ్యం.

Heart Disease : గుండె జబ్బులు వచ్చిన తరువాత పరుగులు తీయడమే తప్ప, ఆ జబ్బులు రాకుండా నివారించే విధానాల పట్ల చాలా మంది శ్రద్ధచూపటంలేదు. దీని వల్ల గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదే క్రమంలో గుండె సర్జరీలకు దారి తీస్తున్నాయి. ఆ పరిస్థితికి తావు లేకుండా ఉండాలంటే జీవన శైలి మార్పులతో, ప్రకృతితో జీవనం సాగించడం ద్వారా గుండెను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులకైనా, మరే ఇతర ఆరోగ్య సమస్యల కైనా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ, విష పదార్థాలే కారణం. శరీర అవసరానికి మించి శరీరంలో ఏది ఉన్నా, అది విషపదార్థంగానే పరిగణించబడుతుంది. ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉన్నా అవి విషపదార్థమే అవుతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. గుండె రక్తనాళాల్లో అడ్డుంకులు రావడానికి కూడా శరీరంలోని విషపదార్థాలే కారణం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం , రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడి గుండె పోటుకు దారితీస్తున్నాయి. తినే ఆహారం, మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటి కారణంగా గుండె పోటులు సంభవిస్తున్నాయి.

రక్తనాళాలన్నీ రక్తప్రసరణకు సంబంధించి ఏ అంతరాయమూ లేకుండా ఉండాలంటే రోజూ శరీరానికి అవసరమైన శ్రమను అందించడం ముఖ్యం. వాయామాల ద్వారా రక్తనాళాలు వ్యాకోచించి, అడ్డంకులు ఏర్పడిన సమయాల్లో కూడా ప్రాణాపాయం కలగకుండా తట్టుకునే శక్తి వస్తుంది. మందుల మీదే పూర్తిగా ఆధారపడితే వాటి దుష్ప్రభావాలతో సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉంటాయి.

రక్తప్రసరణలో ఈ అంతరాయాలేవీ రాకుండా ఉండాలంటే, రక్తం పలుచగా ఉండేలా జాగ్రత్త పడాలి. అందుకు రోజుకు ఐదారు లీటర్ల దాకా నీళ్లు తాగాలి. ఆహార పానీయాల్లో సిట్రస్ అంటే సి. విటమిన్ సమృద్ధిగా ఉండే పండ్లు, విరివిగా తీసుకోవాలి. శరీరం బరువును బాగా నియంత్రణలో ఉంచుకోవాలి. ఆహారంలో బియ్యం, గోదుమలకే పరిమితం కాకుండా, కొర్రలు, సజ్జలు, జొన్నల వంటి తృణధాన్యాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా పదిలంగా కాపాడుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు