Small Sized Uterus : గర్భసంచి చిన్నగా ఉన్న స్త్రీలలో పిల్లలు పుట్టటం కష్టమేనా?

స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు తక్కువ. అయితే సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ అవడం, ప్రీ టెర్మ్ డెలివరీ అయిపోవడం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

Small Sized Uterus : గర్భధారణలో, గర్భాశయం చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటి, ఇది ఫలదీకరణం చేయబడిన పిండం ఇందులోనే నిక్షిప్తమై ఉంటుంది. ప్రసవానికి ముందు శిశువు ఉండే ప్రదేశం గర్భాశయంగా మనం చెబుతుంటాం. ఆడవారిలో అతి తక్కువ వంధ్యత్వ కారకాలలో ఒకటి ముఖ్యమైన గర్భాశయం అనే అవయవానికి సంబంధించినది. గర్భాశయం ఆకారంలో, సైజులో మార్పులు అన్నవి చిన్నవయస్సులో, లేదంటే ఎదుగుతున్న క్రమంలో, పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది.

గర్భాశయం చిన్నదిగా ఉండటం వల్ల ఆడవారి జీవితంలో వంధ్యత్వం లేదా ప్రసూతి సమస్యలను కలుగుతాయి. గర్భం ధరించలేకపోవడం, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడంలో సమస్యలు, సక్రమంగా పీరియడ్స్ రాకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. చిన్న గర్భాశయం, సంతానోత్పత్తి మధ్య ప్రత్యక్ష సంబంధం కలిగిఉంటుంది.

యుక్తవయసు దాటిన స్ర్తీలలో గర్భసంచి సుమారు 8 నుండి 9 సెంటీమీటర్ల పొడవు, 5 నుండి 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రతి అవయవంలోనూ మనిషి మనిషికీ తేడా ఉన్నట్లే గర్భసంచి పరిమాణం విషయంలో కూడా సుమారుగా 1-2 సెంటీమీటర్ల వరకు కొంత తేడా ఉండొచ్చు. ఈ పరిమాణంలో ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ బరువులో ఎనభై గ్రాముల నుంచి కేజీ వరకు పెరగుతుంది.

అదేవిధంగా కొలతలో కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉండే గర్భసంచి ప్రెగ్నెన్సీ సమయంలో 32 – 36 సెంటీమీటర్ల వరకు, కవలలు ఉన్న సందర్భాలలో ఇంకా కొంచెం ఎక్కువ పెరగవచ్చు. గర్భసంచి సైజు కొన్ని సార్లు జన్యు ఆధారితంగా నిర్ణయం కాగా, కొన్నిసార్లు హార్మోన్ల లోపాల వల్ల చిన్నదిగా ఉండటం జరగవచ్చు. ఇటువంటి సందర్భాలలో ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లను నెల నెలా ఇస్తారు. వీటి వల్ల సరైన సైజులో గర్భసంచి పెరుగుతుందన్న గ్యారెంటీ లేకపోయినప్పటికీ, పనితీరును మాత్రం క్రమబద్ధీకరించడానికి ఈ ట్యాబ్లెట్లు తోడ్పడవచ్చు.

స్వల్పంగా సైజు తక్కువగా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు తక్కువ. అయితే సైజు బాగా తక్కువ ఉన్న పరిస్థితులలో అబార్షన్లు అవడం, నెలలు నిండకుండానే బ్లీడింగ్ అవడం, ప్రీ టెర్మ్ డెలివరీ అయిపోవడం, బరువు తక్కువగా ఉన్న పిల్లలు పుట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అదే సమయంలో అసాధారణ ఆకారంలో ఉన్న గర్భాశయాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అలాగని అదరిలో శస్త్రచికిత్స అవసరం కాకపోవచ్చు. లాపరోస్కోపీ మరియు హిస్టెరోస్కోపీ వంటి విధానాలను అనుసరించటం ద్వారా గర్భాశయ అకారాన్ని సరిచేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు