Doctors handwriting : ప్రాణదాతలైన డాక్టర్ల చేతి రాత బాగోదెందుకు..? ఇది చదివితే ఇంకెప్పుడు ఆ మాట అనరు

డాక్టర్ల చేయి చూసి రోగం చెప్పేస్తారు. మందులు రాసి రోగం నయం చేసేస్తారు. కానీ వారి చేతి రాత బాగోదనే విమర్శలు ఉంటాయి. అందుకు కారణాలు తెలుసుకుంటే ఆ విమర్శని వెనక్కి తీసుకుంటారు.

Doctors handwriting

Doctors handwriting : డాక్టర్ల చేతి మందు ఎంత బాగా పనిచేస్తుందో వారి చేతి రాత అంత అందంగా ఉండదని విమర్శిస్తుంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇతర ఏ ఉద్యోగాల్లో ఉన్నవారి కంటే కూడా డాక్టర్లు ఎక్కువగా రాయాలి. కాల క్రమేణ చేతిరాత ఆకట్టుకోదు. అయితే వారి చేతి రాత బాగోకపోవడానికి కారణాలున్నాయి.

Roman saini: 21ఏళ్లకే డాక్టర్ .. ఆ తరువాత కలెక్టర్.. ఇప్పుడు వేల కోట్ల సంస్థకు సహ వ్యవస్థాపకుడు..! ఎవరీ రోమన్ సైనీ..? అతని టెన్త్ మార్కులెన్నో తెలుసా?

డిజిటల్ యుగంలో చేతిరాతని చాలామంది మర్చిపోయారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు.. చేతిరాతను మర్చిపోయేలా చేశాయి. ఇక చేతిరాత బాగా అవసరమైన వారు చదువుకునే విద్యార్ధులు, డాక్టర్లు. అందరికంటే కూడా ఎక్కువ చేతిరాతను ఉపయోగించేది డాక్టర్లు. రోజు వందలాది మందికి ప్రిస్క్రిప్షన్‌లో మందులు రాస్తుంటారు. అయితే వీరి చేతి రాత నార్మల్‌గా అందరికీ అర్ధం కాదు. కేవలం మెడికల్ స్టోర్ వాళ్లకి మాత్రమే అర్ధం అవుతుంది.

 

డాక్టర్ దగ్గరకి రోజులో 50 మంది రోగులు వచ్చారు అనుకోండి. వారి వివరాలు నోట్ చేసుకుని దానికి తగ్గ మందులు రాయాలి. అది ఎంత ఒత్తిడిని కలిగిస్తుందో గ్రహించం. ఇక అత్యవసర కేసుల నిమిత్తం హాజరవుతుంటారు. దాంతో రోజులో ఇంకెంత రాయాలో చెప్పనక్కర్లేదు. చేతి కండరాలు ఎక్కువగా పని చేయడం వల్ల కూడా చేతిరాత అధ్వాన్నంగా మారుతుంది. సాధారణంగానే రాయడం మొదలుపెట్టిన తరువాత చివరికి వెళ్లేసరికి చేతిరాత మారిపోతుంది. డాక్టర్లకి విశ్రాంతి తక్కువగా ఉంటుంది. తమ రాత అందంగా ఉందా? లేదా? అనే దాని కన్నా అవసరమైన సమాచారం రాయడంపై శ్రద్ధ కనపరుస్తారు. వారి రాత ఫార్మసిస్ట్‌లకు మాత్రమే బాగా అర్ధం అవుతుంది.

Haryana : డాక్టర్ వృత్తిని విడిచిపెట్టి వ్యాపార రంగంలో దూసుకుపోతున్న డైనమిక్ లేడీ… ఎవరంటే..

కొన్ని సార్లు mg బదులు mcg అని రాస్తే ఆ చిన్న లోపం పెద్ద అనర్ధాలను తీసుకువస్తాయి. అలాంటి లోపాల్ని తగ్గించడానికి డాక్టర్లు ఎలక్ట్రానిక్ రికార్డుల వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్నిచోట్ల అయితే రోగులకు రాత పూర్వకంగా ప్రిస్క్రిప్షన్ ఇస్తే చట్ట విరుద్ధం. 2006 నాటి డేటా ప్రకారం తప్పుడు ప్రిస్క్రిప్షన్ వల్ల సంవత్సరానికి 7000 మరణాలు సంభవిస్తున్నాయట.. ఈ విషయం తెలిస్తే షాకవుతారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ మీ డాక్టర్‌ని ప్రింటెడ్ ప్రిస్క్రిప్షన్ కావాలని రిక్వెస్ట్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు