7G Brindavan Colony : రీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసుకున్న 7G బృందావన్ కాలనీ..

ఎప్పుడెప్పుడు అన్ని ఎదురు చూస్తున్న 7G బృందావన్ కాలనీ రీ రిలీజ్ టైం వచ్చేస్తుంది.

7G Brindavan Colony re release date announcement

7G Brindavan Colony : ప్రముఖ నిర్మాత ఎ ఎం రత్నం తన కొడుకు రవి కృష్ణని (Ravi Krishna) హీరోగా పరిచయం చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘7G బృందావన్ కాలనీ’. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2004 లో రిలీజ్ అయ్యి తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది. యూత్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్స్ ట్రెండ్స్ నడుస్తుండడంతో.. యూత్ అంతా ఈ మూవీ రీ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.

Hi Nanna : మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తానంటున్న నాని..

సెప్టెంబర్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ రీ రిలీజ్ కి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేయడానికి కూడా ఒక డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 16న ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామంటూ ఒక ప్రత్యేక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ రీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ తో యూత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా సోనియా అగర్వాల్ (Sonia Agarwal) నటించగా సీనియర్ నటుడు చంద్రమోహన్ హీరో తండ్రి పాత్రలో కనిపించాడు. మూవీలో హీరో మరియు తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.

Pushpa 2 : పుష్పరాజ్‌ చిటికెన వేలు గోరు.. నెట్టింట చర్చ..

ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం ఇప్పటి జనరేషన్ వాళ్లకి కూడా ఫేవరెట్. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సీక్వెల్ త్వరలోనే తెరకెక్కిస్తాను అంటూ దర్శకుడు సెల్వరాఘవన్ చెప్పడం, ఇటీవల నిర్మాతలు కూడా ఈ సీక్వెల్ పై కామెంట్స్ చేయడంతో ఆడియన్స్.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలు ఎక్కుతుందని చూస్తున్నారు. రవి కృష్ణ ఈ సీక్వెల్ కూడా హీరోగా నటించబోతున్నాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు