Suresh Gopi
Suresh Gopi apologises : ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ అయిన సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డారు. ఓ మహిళా జర్నలిస్ట్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రాగా ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సురేశ్ గోపీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆమెను కూతురిగా భావించినట్లు తెలిపాడు. ఆ ఆప్యాయతతోనే ఆమె భుజంపై చేయి వేసినట్లు చెప్పాడు. ఈ ఘటన పట్ల ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని, తన ప్రవర్తన వల్ల ఆమె ఇబ్బంది పడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
అసలు ఏం జరిగిందంటే..?
కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సురేశ్ గోపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన పలువురు మీడియా ప్రతినిధులో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ మహిళా జర్నలిస్ట్ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఆమె భుజం పై చేయి వేశాడు. ఈ అనుకోని పరిణామంతో ఇబ్బంది పడిన ఆమె కాస్త దూరం జరిగింది. కొద్ది సేపటి తరువాత మరో ప్రశ్నను అడిగేందుకు ఆమె ముందుకు వచ్చింది. ఆ సమయంలోనూ అతడు మరోసారి అదే పనిని చేశాడు.
Ramgopal varma : నేను మంచి సినిమాలు తీయను.. శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటీజన్లు మండిపడ్డారు. ఆయన తీరుపు తప్పుబట్టారు. దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.