Allari Naresh : సైలెంట్ గా కొత్త సినిమా మొదలుపెట్టేసిన అల్లరి నరేష్..

తాజాగా నేడు సైలెంట్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.

Allari Naresh New Movie Pooja Ceremony Happened

Allari Naresh : వరుస కామెడీ సినిమాలతో మెప్పించిన అల్లరి నరేశ్ నాంది సినిమా నుంచి తన స్టైల్ మార్చి సీరియస్ కంటెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రాగా త్వరలో బచ్చలమల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా నేడు సైలెంట్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు.

Also Read : Vishal : విశాల్‌తో సినిమాలు తీయిద్దని నిర్మాతల నిర్ణయం.. చేస్తాను ఆపేందుకు ట్రై చేయండి అంటూ వార్నింగ్..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లరి నరేష్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. డైరెక్టర్ మెహర్ తేజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రుహాణి శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవల డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వస్తున్న అల్లరి నరేష్ ఈ సారి ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు