Karunakaran : పవన్ ‘తొలిప్రేమ’ డైరెక్టర్‌‌కి ఫస్ట్ అవకాశం వచ్చేలా చేసింది ఎవరు? చెన్నై టు హైదరాబాద్‌కి ఫ్లైట్‌లో..

పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయింది.

Tholiprema Director Karunakaran how he get First Chance From Chennai to Hyderabad

Karunakaran – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయింది. ఈ సినిమాని కరుణాకరన్ డైరెక్ట్ చేసాడు. కరుణాకరన్ కి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కరుణాకరన్ ఆ తర్వాత యువకుడు, వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్.. ఇలా వరుస హిట్ సినిమాలు చేసాడు.

2018లో చివరిసారిగా కరుణాకరన్ సాయి ధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యు సినిమా తీయగా ఆ సినిమా పరాజయం పాలైంది. అప్పట్నుంచి మళ్ళీ ఈ దర్శకుడు కనిపించలేదు. తాజాగా విజయ్ ఆంటోని తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడంతో కరుణాకరన్ చాన్నాళ్లకు కనిపించాడని వైరల్ అవుతున్నారు. అయితే తమిళనాడుకు చెందిన కరుణాకరన్ అసలు టాలీవుడ్ కి వచ్చి పవన్ తో ఎలా సినిమా తీసాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు తెలుసా?

Also Read : Mega Family : పారిస్ ఒలంపిక్స్.. పారిస్ వీధుల్లో మెగా కపుల్స్ సందడి.. వైరల్ అవుతున్న వీడియోలు..

తమిళ్ లో పలు సినిమాలకు రైటర్ గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కరుణాకరన్ తాను రాసుకున్న కథ కోసం హీరోని వెతుకుతున్న సమయంలో సూపర్ హిట్ మ్యాగజైన్ పై పవన్ కళ్యాణ్ ఫోటో చూసి చెన్నైలోని సూపర్ హిట్ ఆఫీస్ కి వెళ్లి సూపర్ హిట్ అధినేత దివంగత సీనియర్ పీఆర్వో BA రాజుని కలిశారు. మ్యాగజైన్ పై ఫోటో చూపించి పవన్ కళ్యాణ్ ని నేను కలవాలి, సినిమా కథ చెప్పాలి, ఆయనతో సినిమా తీయాలని చెప్పారంట.

BA రాజు కరుణాకరన్ గురించి అన్ని వివరాలు కనుక్కొని చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆయనే చెన్నై టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ కరుణాకరన్ ని పంపించారట. అలా కరుణాకరన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి ఓకే చేసుకొని తొలిప్రేమ లాంటి క్లాసిక్ ఫిలిం ఇచ్చాడు. ఇక తమిళ వ్యక్తి అయిన కరుణాకరన్ తొలిప్రేమ హిట్ తో ఇక్కడే టాలీవుడ్ లో సెటిల్ అయిపోయి ఇక్కడే వరుస సినిమాలు చేసాడు. మళ్ళీ కరుణాకరన్ ఎప్పుడు సినిమా తీస్తాడు అని అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు