Mega Family : పారిస్ ఒలంపిక్స్.. పారిస్ వీధుల్లో మెగా కపుల్స్ సందడి.. వైరల్ అవుతున్న వీడియోలు..

మన మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా కూడా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.

Mega Family : పారిస్ ఒలంపిక్స్.. పారిస్ వీధుల్లో మెగా కపుల్స్ సందడి.. వైరల్ అవుతున్న వీడియోలు..

Chiranjeevi Ram Charan Enjoying in Paris Olympics with Families Video goes Viral

Updated On : July 27, 2024 / 9:32 AM IST

Mega Family : పారిస్ లో 2024 ఒలంపిక్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు ఈ ఒలంపిక్స్ లో పోటీ చేయడానికి పారిస్ వెళ్లారు. పలు దేశాల ప్రముఖులు కూడా పారిస్ ఒలంపిక్స్ ని తిలకించడానికి వెళ్లారు. నిన్న గ్రాండ్ గా సంబరాలతో పారిస్ ఒలంపిక్స్ ని మొదలుపెట్టారు.

ఇక మన మెగాస్టార్ చిరంజీవి, భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా కూడా వెకేషన్ కి లండన్ వెళ్లి అటునుంచి పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. చిరంజీవి ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా ప్రకటించారు. పారిస్ వీధుల్లో ఈ మెగా కపుల్స్ సందడి చేస్తున్నారు. పారిస్ ఒలంపిక్స్ వేడుకలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే మెగా కపుల్స్ వెకేషన్ నుంచి ఓ ఫోటో రాగా తాజాగా ఉపాసన పారిస్ వీధుల్లో తిరుగుతున్న వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో పోస్ట్ చేసింది.

Also Read : Naresh : సినిమాలు పైరసీ చేసేవాళ్లకు సవాల్ విసిరిన నరేష్.. ఈ సినిమాని పైరసీ చేయలేరు..

చిరంజీవి, సురేఖ పారిస్ వీధుల్లో నడుస్తూ ఫోటోలు దిగుతున్నారు. రామ చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటో కూడా షేర్ చేసింది. అక్కడ పారిస్ వీధుల్లో ఒలంపిక్స్ హంగామాలో ఉపాసన సందడి కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలను డౌన్ లోడ్ చేసి అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో పారిస్ లో ఈ మెగా కపుల్స్ చేసే హంగామా వైరల్ గా మారింది.