Raju Srivastav: బాలీవుడ్ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఇక లేరు..

బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా కెరీర్ ప్రారంభించిన "రాజు శ్రీవాస్తవ". 'మైనే ప్యార్ కీయ', 'బాజిగర్', 'తేజాబ్' వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆయన ఫేట్ మారిపోయింది అనే చెప్పాలి. శక్తిమ్యాన్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Raju Srivastav: బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ద్వారా కెరీర్ ప్రారంభించిన “రాజు శ్రీవాస్తవ”. ‘మైనే ప్యార్ కీయ’, ‘బాజిగర్’, ‘తేజాబ్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఆయన ఫేట్ మారిపోయింది అనే చెప్పాలి. శక్తిమ్యాన్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Bollywood : ఇద్దరు స్టార్ హీరోలు.. అయినా తప్పని ఫ్లాపులు.. బాలీవుడ్ కి భరోసా ఎప్పుడో??

ముఖ్యంగా పలు టెలివిజన్ కామెడీ షోస్ తో స్టాండ్-అప్ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘శ్రీవాస్తవ’ను 2014లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ఆయనను నామినేట్ చేశారు. దీంతో రాజు శ్రీవాస్తవ వివిధ నగరాల్లో తన కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతను ప్రోత్సహిస్తూ షోస్ కూడా నిర్వహించారు. ఇక 58 ఏళ్ళ వయసున్న శ్రీవాస్తవ ఈరోజు ఉదయం 10:20 గంటలకు మరణించారు.

ఆగస్టు 10న అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావడంతో, ఆయనను ఢిల్లీలోని AIIMSకి తరలించారు. అప్పటి నుంచి 40 రోజులకు పైగా స్పృహలోకి రాలేదు. గుండెపోటు రావడంతో అతడి మెదడు దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. వైద్యులు ప్రయత్నించినప్పటికీ, అతని ఆరోగ్యం క్షీణిస్తూనే వస్తుండడంతో ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ట్రెండింగ్ వార్తలు