Dil Raju : ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు.. బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తారు..

ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ''ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని.............

Dil Raju :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీంతో స్టార్లంతా హైదరాబాద్ లో సందడి చేశారు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.

BiggBoss 6 Day 19 : కొత్త బిగ్‌బాస్ కెప్టెన్ ఎవరో తెలుసా.. మళ్ళీ గీతూ హడావిడి..

ఈ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ”ఈ రోజుల్లో ఒక హీరోని పెట్టుకుని సినిమా తీయాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. అలాంటిది ఇంతమంది హీరోలు, హీరోయిన్లని పెట్టి మణిరత్నంగారు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ని రెండు భాగాలుగా తీయడం చాలా గ్రేట్‌. ఇప్పుడు సినిమాకు ప్రాంతం, భాషతో సంబంధం లేదు. సినిమా బాగుంటే ఇండియా మొత్తం ఆదరిస్తారు. RRR, KGF, కార్తికేయ 2 సినిమాలలాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ కూడా ఇండియా మొత్తం అద్భుతం సృష్టిస్తుందని అనుకుంటున్నాను. రెహమాన్‌ గారు మనతో ఉన్నారు అని చెప్పుకునేందుకు, మన ఇండియన్ అయినందుకు భారతీయుడిగా గర్వపడతాం’’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు