NTR – Prasanth Neel : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే..?

తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ఇచ్చారు.

NTR Prasanth Neel Movie Update Announced

NTR – Prasanth Neel : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత వరుసగా భారీ సినిమాలు ఓకే చేస్తూ ఫుల్ బిజీలో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దేవర సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, ఓ సాంగ్ రిలీజ్ చేసారు. దేవర పార్ట్ 1 సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కానుంది.

ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో సినిమా ఎప్పుడో ప్రకటించారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ 2024 ఆగస్టు నుంచి మొదలుపెట్టనున్నట్టు అనౌన్స్ చేసారు మూవీ యూనిట్. అలాగే ఇది పవర్ హౌస్ ప్రాజెక్ట్ అంటూ హైప్ ఇచ్చారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Also Read : NTR : ఎన్టీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. ఎన్టీఆర్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. దేవర షూటింగ్ అవ్వగానే ఎన్టీఆర్ నీల్ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నారు. అటు వార్ 2 కూడా సమాంతరంగా షూట్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ KGF, సలార్ సినిమాల్లో హీరోలని ఓ రేంజ్ మాస్ లో చూపించిన ప్రశాంత్ నీల్ మరి ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు