Brahmastra Pre Release Event : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. నష్టం ఎన్ని కోట్లో తెలుసా??

బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ ని సౌత్ లో భారీగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో...............

Brahmastra Pre Release Event :  రణబీర్ కపూర్, అలియా జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మన అస్త్రాల గురించి రాసిన కథతో భారీగా తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. ఇందులో నాగార్జున, అమితాబ్, మౌనిరాయ్ ముఖ్యపాత్రల్లో నటించగా పాన్ ఇండియా సినిమాగా బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ లో బాయ్ కాట్ వివాదం నడుస్తుండటంతో ఇటీవల బాలీవుడ్ సినిమాలు తెలుగు, సౌత్ మార్కెట్స్ ని టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ ని సౌత్ లో భారీగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ క్యాన్సిల్ రద్దు వెనుక రాజకీయ కోణం ఉందని కూడా వినిపిస్తుంది. ఈ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో చిత్ర యూనిట్ కి భారీగా నష్టం ఏర్పడింది.

Rajamouli : బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే ఎన్టీఆర్ తొడకొట్టేవాడు.. కానీ..

ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఓ హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ.. ఫైర్ వర్క్స్, ఎన్టీఆర్, రణబీర్ తో స్పెషల్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేశాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అని చెప్పారు. అంటే ఈవెంట్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్ధమవుతుంది. అయితే బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. అన్ని ఖర్చులు కలిపి ఈవెంట్ కి దాదాపు 2 కోట్లకు పైనే అయినట్టు తెలుస్తుంది. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ రెండు కోట్లు వృధా అయినట్టే. అంతే కాక అప్పటికప్పుడు పార్క్ హయత్ లాంటి హోటల్ లో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి మరో 10 లక్షలు ఖర్చు అయినట్టు సమాచారం. ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణాలేమైనా చిత్ర యూనిట్ కి మాత్రం 2 కోట్ల పైనే నష్టం వాటిల్లింది.

ట్రెండింగ్ వార్తలు