Pawan Kalyan HariHara VeeraMallu Director Krish Replaced With Jyothi Krishna
Jyothi Krishna : డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా పాన్ ఇండియా పీరియాడిక్ సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ పొలిటికల్ బిజీ వల్ల ఈ సినిమా సాగుతూ వస్తుంది. భారీ బడ్జెట్ సినిమా, ఎక్కువ షూటింగ్ డేట్స్ ఉన్న సినిమా కావడంతో హరిహర వీరమల్లు మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసినా ఇంకా లేట్ అవుతూనే ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు యాక్టివ్ అయింది.
వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ, అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా నేడు హరిహర వీరమల్లు టీజర్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే అదిరిపోయింది. పవన్ యాక్షన్ సీక్వెన్స్ ల సూపర్ ఉన్నాయి. అయితే టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్స్ మీద డైరెక్టర్ క్రిష్ పేరు లేకపోవడంతో డైరెక్టర్ క్రిష్ ని ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ క్రిష్ పై డ్రగ్స్ కేసు ఆరోపణలు రావడంతో అప్పట్నుంచి క్రిష్ ని ఈ ప్రాజెక్టు నుంచి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.
Also Read : HariHara VeeraMallu : ఆ హీరోల బాటలోనే పవన్.. ‘హరిహర వీరమల్లు’ కూడా రెండు పార్టులు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
తాజాగా నేడు టీజర్ లో డైరెక్టర్స్ పేర్ల స్థానంలో క్రిష్ పేరుతో పాటు జ్యోతి కృష్ణ పేరు కూడా వేశారు. ప్రస్తుతం మిగిలిన సినిమాని ఈ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. హరిహర వీరమల్లు నిర్మాత AM రత్నం తనయుడే ఈ జ్యోతికృష్ణ. 7/G బృందావన కాలనీ సినిమా హీరో రవి కృష్ణకు అన్నయ్య అవుతాడు జ్యోతికృష్ణ. జ్యోతి కృష్ణ కూడా రచయిత, దర్శకుడే.
జ్యోతి కృష్ణ గతంలో తమిళ్, తెలుగులో.. ఎనక్కు 20 ఉనక్కు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్.. లాంటి పలు సినిమాలని తెరకెక్కించాడు. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేశాడు. ఇప్పుడు క్రిష్ తప్పుకోవడంతో హరిహర వీరమల్లు సినిమా మిగిలిన షూటింగ్ ని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే మూవీ యూనిట్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో చేయనున్నారు అని తెలిపినప్పటికీ టాలీవుడ్ సమాచారం ప్రకారం క్రిష్ తప్పుకున్నట్టు జ్యోతి కృష్ణ చేతుల మీదుగే మిగిలిన సినిమా పూర్తవుతుందని సమాచారం.
ఇక హరిహర వీరమల్లు రెండు పార్టులుగా కూడా రానుందని టీజర్ ద్వారా తెలిపారు. మొదటి పార్ట్ 2024లో రానుంది. దీంతో పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.