HariHara VeeraMallu Teaser : హరిహర వీరమల్లు టీజర్ వచ్చేసింది.. అందరి లెక్కలు సరిచేస్తాడు.. టీజర్ అదిరిపోయిందిగా..

హరిహర వీరమల్లు టీజర్ వచ్చేసింది..

HariHara VeeraMallu Teaser : హరిహర వీరమల్లు టీజర్ వచ్చేసింది.. అందరి లెక్కలు సరిచేస్తాడు.. టీజర్ అదిరిపోయిందిగా..

Pawan Kalyan HariHara VeeraMallu Teaser Released

HariHara VeeraMallu Teaser : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా క్రిష్ దర్శకత్వంలో AM రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ అయిపోయినా పవన్ ఎన్నికల బిజీ వల్ల కొన్నాళ్ళు సినిమాని పక్కన పెట్టారు. ఇటీవల ఈ సినిమా నుంచి ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్ తో టీజర్ వస్తుందని తెలిపారు మూవీ యూనిట్. ఇది పవన్ మొదటి పాన్ ఇండియా, పీరియాడిక్ సినిమా కావడంతో అభిమనులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Also Read : Pushpa Song : ‘పుష్ప’ టైటిల్ సాంగ్ స్టెప్పులు అదుర్స్.. ఆ స్టెప్పులు కంపోజ్ చేసిన డాన్స్ మాస్టర్ ఎవరో తెలుసా?

తాజాగా హరిహర వీరమల్లు టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ లో మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటుంటే వాళ్ళని దోచుకోడానికి ఓ దొంగ వస్తాడు, 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా కథాంశం ఉండనున్నట్టు చూపించారు. టీజర్ అయితే అదిరిపోయింది. పవన్ యాక్షన్ సీన్స్ కూడా కుమ్మేసాడు. మీరు కూడా హరిహర వీరమల్లు టీజర్ చూసేయండి.

 

ఇక ప్రస్తుతం హరిహర వీరమల్లు గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమా కూడా రెండు పార్టులుగా రానున్నట్టు తెలుస్తుంది. టీజర్ రిలీజ్ కి హరిహర వీరమల్లు పార్ట్ 1 అని రిలీజ్ చేశారు. పార్ట్ 1కి Sword vs Spirit (కత్తి వర్సెస్ ఆత్మ) అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా 2024 లోనే రిలీజ్ కాబోతుందని ప్రకటించారు.