HariHara VeeraMallu : ఆ హీరోల బాటలోనే పవన్.. ‘హరిహర వీరమల్లు’ కూడా రెండు పార్టులు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..
పవన్ కూడా హరిహర వీరమల్లు సినిమా రెండు పార్టులు అనౌన్స్ చేయడం విశేషం.

Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Coming with Two Parts Fans
HariHara VeeraMallu Part 1 : పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా క్రిష్ దర్శకత్వంలో AM రత్నం నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ ఇన్నాళ్లు ఈ సినిమాని మొత్తానికే పక్కన పెట్టేసారు అనుకున్నారు. కానీ కొన్నాళ్లుగా హరిహర వీరమల్లు నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ యాక్టివ్ అయింది మూవీ యూనిట్. తాజాగా నేడు టీజర్ రిలీజ్ చేశారు. 17వ శతాబ్దంలో మొఘల్స్ కాలంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
అయితే టీజర్ రిలీజ్ తో పాటు మరో ఆసక్తికర విషయాన్ని కూడా మూవీ యూనిట్ తెలిపారు. ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. బాహుబలితో మొదలైన ఈ రెండు పార్టుల ట్రెండ్ స్టార్ హీరోలు అంతా ఫాలో అయిపోతున్నారు. సలార్, దేవర కూడా రెండు పార్టులు అనౌన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బాటలోనే పవన్ కూడా హరిహర వీరమల్లు సినిమా రెండు పార్టులు అనౌన్స్ చేయడం విశేషం.
హరిహర వీరమల్లు పార్ట్ 1కి Sword vs Spirit (కత్తి వర్సెస్ ఆత్మ) అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా 2024లో రిలీజ్ కాబోతుందని కూడా ప్రకటించారు. దీంతో పార్ట్ 1 సినిమా ఎన్నికల తర్వాత ఈ సంవత్సరమే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మరి పార్ట్ 2 ఎప్పుడు తెస్తారో చూడాలి. ఇక ఈ సినిమా కూడా రెండు పార్టులుగా భారీగా వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం ఓడరేవు.. లాంటి భారీ సెట్‌లను నిర్మించడం విశేషం.