Samantha : సమంత బర్త్ డే ఏ దేశంలో చేసుకుందో తెలుసా? బర్త్ డే ట్రిప్ ఫోటోలు షేర్ చేసిన సామ్..

తాజాగా సమంత తన బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలను షేర్ చేసింది.

Samantha Shares her Birthday Celebrations Photos in Social Media

Samantha : సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఇటీవల 28 ఏప్రిల్ న సమంత బర్త్ డే అని తెలిసిందే. సమంత పుట్టిన రోజుని ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్యాన్స్, నెటిజన్లు, పలువురు ప్రముఖులు సమంతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : HariHara VeeraMallu : ఆ హీరోల బాటలోనే పవన్.. ‘హరిహర వీరమల్లు’ కూడా రెండు పార్టులు.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

అయితే సమంత తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోడానికి గ్రీస్ దేశానికి వెళ్ళింది. గ్రీస్ రాజధాని ఏథెన్స్ లో సమంత బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఏథెన్స్ లో తాను తిరిగిన ప్రదేశాలు, తన బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

ఇక సమంత త్వరలో సిటాడెల్ సిరీస్ తో రాబోతుంది. అలాగే తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ఆసక్తికర టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తోంది.