RRR For Oscars: “RRR”ను ఆస్కార్ రేస్‌లో నుంచి తప్పించిన భారత ప్రభుత్వం.. రాజకీయం అంటున్న నెటిజెన్లు!

RRR.. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ తరఫున ప్రతనిథ్యం ఇవ్వాలని ఇండియన్ ఆడియన్స్ తో పాటు, వరల్డ్ వైడ్ ఆడియన్స్ అండ్ సినీ సాంకేతిక నిపుణులు కూడా ఆశించారు. అయితే భారత ప్రభుత్వం వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ, ఇండియా నుంచి ఆస్కార్స్ కు...

RRR For Oscars: RRR.. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిచిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఇందులో నటించిన ‘ఎన్టీఆర్-రాంచరణ్’ల నటనకు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యి నీరాజనాలు పలుకుతున్నారు.

RRR For Oscars: ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్.. ట్రెండింగ్‌కు కారణమిదే!

ఈ సినిమా అత్యున్నత ఓటిటి ప్లాట్‌ఫాం అయిన ‘నెట్ ఫ్లిక్స్’లో వరల్డ్ వైడ్ గా మూడువారాలు పాటు వరసగా ట్రెండ్ లో నిలిచింది అంటే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం క్రేయెట్ చేసిందో అర్ధమవుతుంది. కాగా, ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ తరఫున ప్రతనిథ్యం ఇవ్వాలని ఇండియన్ ఆడియన్స్ తో పాటు, వరల్డ్ వైడ్ ఆడియన్స్ అండ్ సినీ సాంకేతిక నిపుణులు కూడా ఆశించారు.

అయితే భారత ప్రభుత్వం వీటన్నిటికీ బ్రేక్ ఇస్తూ.. ఇండియా నుంచి ఆస్కార్స్ కు గుజరాతీ ఫిల్మ్ అయిన “చలో షోను” ఎంపిక చేసింది. అన్నీ అర్హతలు ఉన్నా ‘ఆర్ఆర్ఆర్’ ని ఆస్కార్స్ కు ఎంపిక చేయకపోవడంతో, రాజకీయం చేసారంటూ ఆరోపిస్తున్నారు నెటిజెన్లు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు