Sodara Sodarimanulara Review : సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ.. అక్రమంగా కేసులో ఇరికిస్తే..?

ఫస్ట్ హాఫ్ కథ సాధారణంగా సాగినా, సెకండ్ హాఫ్ లో హీరో ఎలా బయటకి వచ్చాడు అనేది ఆసక్తిగా సాగుతుంది.

Kamal Kamaraju Sodara Sodarimanulara Movie Review and Audience ratings

Sodara Sodarimanulara Movie : కమల్ కామరాజు(Kamal Kamaraju), అపర్ణ దేవి(Aparna Devi) జంటగా కాలకేయ ప్రభాకర్(Kalakeya Prabhakar), పృథ్విరాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా సోదర సోదరీమణులారా. గుండా రఘుపతి రెడ్డి దర్శకత్వంలో విజయ్ కుమార్ పైండ్ల నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఇటీవల్ల కొన్ని సినిమాలు ముందే ప్రీమియర్ వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సోదర సోదరీమణులారా సినిమా కూడా ప్రివ్యూ వేశారు.

కథ విషయానికొస్తే.. క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ సాధారణ జీవితం గడుపుతున్న హీరో ఓ రోజు తన క్యాబ్ లో ఎక్కువ దూరం ప్యాసింజర్ ని తీసుకెళ్లగా అక్కడ కొంతమంది ఒక అమ్మాయిని జాగ్రత్తగా ఇంటిదగ్గర దింపాలని, పడుకుందని హెల్ప్ చేయమని, అర్ధరాత్రి అని అడగడంతో ఓకే చెప్తాడు. దీంతో అతన్ని ఓ రేప్ అండ్ మర్డర్ కేసులో ఇరికిస్తారు. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్, ఎలాంటి తప్పు చేయకుండా రేప్, మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఆ కేసు వల్ల తన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అతను కేసులోంచి ఎలా బయటపడ్డాడు అనేది తెరపై చూడాల్సిందే.

కథనం విషయానికొస్తే.. సినిమాలో ఏం జరిగింది అని వెనక్కి, ముందుకు తీసుకువెళ్తుంటాడు. ఈ స్క్రీన్ ప్లేని కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా రాసుకున్నారు. కమల్ కామరాజు అమాయక డ్రైవర్ పాత్రలో బాగా నటించాడు. భర్త కోసం పరితపించే భార్య పాత్రలో అపర్ణ దేవి మెప్పించింది. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. ఇక కెమెరామెన్ పనితనం బాగుంది. నైట్ సీన్స్ ని చాలా బాగా తెరకెక్కించారు. ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది. ఫస్ట్ హాఫ్ కథ సాధారణంగా సాగినా, సెకండ్ హాఫ్ లో హీరో ఎలా బయటకి వచ్చాడు అనేది ఆసక్తిగా సాగుతుంది. అయితే సినిమాకు టైటిల్ ఇదే ఎందుకు పెట్టారని మాత్రం మనకు సందేహం కలగక మానదు. సోదర సోదరీమణులారా సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక: ఈ రివ్యూ, రేటింగ్స్ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే

ట్రెండింగ్ వార్తలు