Kantara: పుష్ప కలెక్షన్లు కొల్లగొట్టిన కాంతార..

కన్నడ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంతార'. కర్ణాటక గ్రామదేవతల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. కేజిఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఒక్క కన్నడలోనే 1 కోటి టికెట్స్ అమ్ముడయ్యి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

Kantara: కన్నడ నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’. కర్ణాటక గ్రామదేవతల కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ పొందింది. కేజిఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఒక్క కన్నడలోనే 1 కోటి టికెట్స్ అమ్ముడయ్యి రికార్డు సృష్టించింది.

Kantara: కర్ణాటకలో ‘కాంతార’ సెన్సేషనల్ రికార్డు.. ఏకంగా కోటి టికెట్లు!

దేశవ్యాప్తంగా పలు రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా కలెక్షన్స్ పరంగా అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. పుష్ప ఫుల్ రన్‌లో రూ.350.3 కోట్లను ఆర్జించగా, కాంతార ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350.7 కోట్లు సంపాదించింది. ఇక హిందీ మార్కెట్‌లో రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి కేజిఎఫ్ – చాప్టర్ 1 ఫుల్ రన్ కలెక్షన్స్ రాబట్టేసింది.

కాగా పుష్ప సెకండ్ పార్ట్ ‘ది రూల్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇంకా షూటింగ్ మొదలుపెట్టుకొని ఈ మూవీ త్వరలోనే బ్యాంకాక్ వెళ్లి అక్కడ అడవుల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు