Godfather: మెగాస్టార్ సినిమాపై సూపర్‌స్టార్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను పూర్తి పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దాడు. గాడ్‌ఫాదర్ సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ జాయిన్ అయ్యారు.

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను పూర్తి పొలిటికల్ డ్రామాగా తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్‌కు అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

GodFather Collections : నాలుగు రోజుల్లో.. 100 కోట్ల గాడ్‌ఫాదర్.. మరింత దూసుకుపోతున్న బాస్ సినిమా..

కాగా గాడ్‌ఫాదర్ సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ రజినీకాంత్ జాయిన్ అయ్యారు. ఆయన తాజాగా గాడ్‌ఫాదర్ సినిమాను చూశారని.. ఈ సినిమాపై ఆయన ప్రశంసలు కురిపించారని దర్శకుడు మోహన్ రాజా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గాడ్‌ఫాదర్ సినిమా చూసిన సూపర్ స్టార్ ఈ సినిమా అద్భుతంగా ఉందని.. సినిమా కథ చాలా బాగుందని.. చిరు పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తాడని మోహన్ రాజా తెలిపాడు.

Godfather: గాడ్‌ఫాదర్ గర్జన.. మరో 600 స్క్రీన్స్ యాడ్ అయ్యాయిగా!

ఏదేమైనా చిరు నటించిన గాడ్‌ఫాదర్ మూవీపై రజినీకాంత్ ప్రశంసలు కురిపించడంతో దర్శకుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేనని ఆయన తెలిపారు. కాగా, గాడ్‌ఫాదర్ మూవీలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు