Payal Rajput : మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న పాయల్.. ఈసారి పోలీసాఫీసర్‌గా..

మరో సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది పాయల్ రాజ్‌పుత్.

Payal Rajput New Lady Oriented Movie Rakshana Poster Released

Payal Rajput : Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పలు సినిమాలతో మెప్పించిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘మంగళవారం’ సినిమాలో ఎవరూ ఊహించని క్యారెక్టర్ వేసి తన నటనతో మెప్పించి సూపర్ హిట్ కొట్టింది. మంగళవారం సినిమా కథ పరంగా నడిచినా పాయల్ మెయిన్ లీడ్ కింద కనిపిస్తుంది. ఇప్పుడు మరో సారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది పాయల్ రాజ్‌పుత్.

పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోష‌న్‌, మాన‌స్, రాజీవ్ కనకాల.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రక్షణ’. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా కనిపించబోతుంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ఈ సినిమాని నిర్మిస్తూ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

Also Read : Anchor Ravi : రవిని యాంకర్ చేసింది ఆ స్టార్ హీరో అని తెలుసా? కొరియోగ్రాఫర్ గా వచ్చి యాంకర్ ఎలా అయ్యాడు?

తాజాగా రక్షణ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో పాయల్ రాజ్‌పుత్ పోలీసాఫీసర్ గా కనిపించింది. ఈ సందర్భంగా ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ.. ర‌క్ష‌ణ సినిమా క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను ఈ సినిమాలో సరికొత్తగా ఆచూస్తారు. నటిగా ఆమెకి మరోసారి మంచి ఇమేజ్‌ వస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన నిజ సంఘటనతో ఈ కథ రాసుకున్నాము. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది అని తెలిపారు.