Skanda : రామ్ పోతినేని ‘స్కంద’ ఏ ఓటీటీలో? స్ట్రీమింగ్ ఎప్పుడు..?

స్కంద సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, B C సెంటర్స్ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

Ram Pothineni Boyapati Srinu Skanda Movie OTT Streaming Platform Releasing date Details

Skanda : మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu), ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో తెరకెక్కిన ఊర మాస్ సినిమా ‘స్కంద‌’. రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా ఈ మూవీలో చూపించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

స్కంద సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, B C సెంటర్స్ వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. బోయపాటి తన మాసిజాన్ని ఈ సారి మరింత డబల్ చేయగా రామ్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం థియేటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది స్కంద.

Also Read : Peddha Kapu 1 Twitter Review : పెదకాపు 1 ట్విట్టర్ రివ్యూ.. క్లాస్ శ్రీకాంత్ అడ్డాల మాస్ తో మెప్పించాడా?

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నిప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ దక్కించుకుంది. సినిమా రిలీజయిన నెల రోజులకు ఓటీటీలో వస్తుందని సమాచారం. దీంతో అక్టోబర్ చివరి వారంలో దసరా కానుకగా స్కంద సినిమా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రాబోతున్నట్టు తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు