RRR Naatu Naatu Song: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించగా, పీరియాడిక్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించాడు. అల్లూరి సీతారామారాజు పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో తారక్ చేసిన పర్ఫార్మెన్స్కు యావత్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
RRR: కొమురం భీముడో కాదా.. ఇది యాడ్ ఆ.. భలే సెట్ చేశారుగా!
ఇక ఈ సినిమాలో ఇద్దరు కలిసి చేసి నాటు నాటు సాంగ్ ఎంతపెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటలో ఇద్దరు హీరోలు కూడా పోటీపడి డ్యాన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తారక్, చరణ్ ఫాస్ట్ బీట్‌కు వేసిన స్టెప్స్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన ఇంగ్లీష్ వర్షన్ సాంగ్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ది కారిడార్ డ్యాన్స్ అనే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?
నాటు నాటు పాటకు ఇంగ్లీష్ లిరిక్స్‌ను వాడి కొంతమంది చేసిన ఈ కాన్సెప్ట్ వీడియోలో మనం ఆర్ఆర్ఆర్ మ్యూజిక్‌ను స్పష్టంగా వినొచ్చు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా తన సత్తాను ఏదో ఒక విధంగా చూపిస్తూ నెట్టింట నిత్యం వైరల్‌గా సాగుతోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
The Corridor Coup led by @markiplier was nearly a success.. until this happened.
If you’re not watching the exclusives on https://t.co/e7HHFyHDuA, you have no idea what you’re missing. pic.twitter.com/HEzCtLqOwB
— Corridor (@CorridorDigital) September 30, 2022