RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు అభిమానులు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం మొదలుకొని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల పర్ఫార్మెన్స్ వరకు ప్రతి ఒక్కటి ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని వారు అంటున్నారు. ఇక ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
RRR For Oscars: సెప్టెంబర్ 30న ‘ఆర్ఆర్ఆర్’కు అగ్నిపరీక్ష..?
అయితే.. ఈ సినిమాలో హీరోల పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే.. రామరాజుగా చరణ్, భీమ్‌గా తారక్ విధ్వంసకరమైన యాక్టింగ్‌తో చెలరేగిపోయారు. ఇక నవరసాలను పిండి పిప్పిచేసే తారక్ ఈ సినిమాలో ‘కొమురం భీముడో..’ పాటతో యావత్ ప్రపంచవ్యాప్తంగా జయహో అనిపించుకున్నాడు. ఆ పాటలో ఆయన ఎక్స్ప్రెషన్స్కు అందరూ ఫిదా అయ్యారు. కాగా, తాజాగా ఈ పాటకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరు.. ఏంటి… ఇది కొమురం భీముడో పాట కాదా… యాడ్ ఆ.. అని అవాక్కవ్వడం ఖాయం.
Komuram Bheemudo Lyrics: రక్తం మరిగించే ‘కొమురం భీముడో’ పాట.. లిరిక్స్, వాటి అర్థం తెలుసుకోండి!
ఒరిజినల్ వీడియోలను ఎడిట్ చేసి పర్ఫెక్ట్గా సింక్ చేసే కొందరు నెటిజన్లు, కొమురం భీముడో పాటకు సంబంధించిన వీడియోను ఓ చాక్లెట్ యాడ్ వీడియోగా మార్చారు. డెయిరీ మిల్క్ చాక్లెట్ యాడ్‌లో వచ్చే ‘కిస్ మీ..’ పాటకి తారక్ పర్ఫార్మెన్స్ను పర్ఫెక్ట్గా సింక్ చేసిన విధానం సూపర్‌గా ఉంది. ఈ వీడియో చూస్తే, నిజంగా ఇది ఈ యాడ్ కోసమే చేశారా అనేలా ఉండటం విశేషం. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఏదో ఒక విధంగా ఇంకా వైరల్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. మరి ఈ పర్ఫెక్ట్ సింక్ వీడియోను మీరు ఓసారి చూసేయండి.