Gangs of Godavari : విశ్వక్ సేన్ సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..

విశ్వక్‌ సేన్, నేహ‌శెట్టి జంట‌గా న‌టించిన‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.

Vishwak sen Gangs of Godavari movie once again post pone new releasing date announced

Gangs Of Godavari release date : విశ్వక్‌ సేన్, నేహ‌శెట్టి జంట‌గా న‌టించిన‌ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో అంజలి కీల‌క పాత్ర‌లో న‌టించింది. షూటింగ్ ఎప్పుడో పూర్తి అవ్వ‌గా గత సంవత్సరమే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. అయితే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. మే 17 విడుద‌ల చేస్తామంటూ ఇటీవ‌ల చిత్ర బృందం తెలియ‌జేసింది.

అయితే.. మ‌రోసారి ఈ సినిమాను వాయిదా వేశారు. మే 31 ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా మూవీ యూనిట్ తెలియ‌జేసింది. ఎందుకు వాయిదా వేశారు అన్నది స‌రైన కార‌ణం తెలియ‌న‌ప్ప‌టికీ ఐదేళ్ల క్రితం అదే రోజున విశ్వ‌క్ హీరోగా తెర‌కెక్కిన ఫ‌ల‌క్‌నుమా దాస్ విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది. ఈ కార‌ణంతోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రిని మే 31 తీసుకువ‌స్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ గా గోదావరి జిల్లాల్లో రాజకీయ కథాంశంతో తెరకెక్కబోతుంది సమాచారం.

Anand Deverakonda : అన్న‌య్య పుట్టిన రోజు.. ఆనంద్ దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ పోస్ట్‌..