Prabhas Joined in Manchu Vishnu Kannappa Movie Shooting
Prabhas – Kannappa – Manchu Vishnu : మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప భారీగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, స్టార్ కాస్ట్ తో కన్నప్ప సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, నయనతార, మధుబాల.. లాంటి స్టార్స్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటనలు వచ్చాయి. కన్నప్ప సినిమా ఇటీవల న్యూజిలాండ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇటీవలే అక్షయ్ కుమార్ తన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశారు. తాజాగా ప్రభాస్ కన్నప్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ పక్క రాజా సాబ్ షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సమయంలో రాజా సాబ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి మంచు విష్ణు కోసం కన్నప్ప షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతున్న కన్నప్ప షూటింగ్ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.
Also Read : Gangs of Godavari : విశ్వక్ సేన్ సినిమా మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్..
దీని గురించి విష్ణు మంచు అధికారికంగా ప్రకటించారు. విష్ణు తన సోషల్ మీడియాలో ప్రభాస్ కాలు అడుగుపెడుతున్నట్టు ఉన్న ఓ పోస్టర్ ని షేర్ చేస్తూ.. నా బ్రదర్ షూట్ లో జాయిన్ అయ్యాడు అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ కన్నప్ప షూట్ మొదలు పెట్టాడని తెలియడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నారో అధికారికంగా చెప్పలేదు కానీ శివుడి పాత్రలో కనపడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
My brother joined the shoot #Prabhas#kannappa? pic.twitter.com/WW8WQbBLec
— Vishnu Manchu (@iVishnuManchu) May 9, 2024
ఇక దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రభాస్ తో పాటు వేరే భాషల నుంచి వచ్చిన నటులు కన్నప్ప ప్రాజెక్ట్ లోకి రావడంతో ఈ సినిమాకి నిజమైన పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ తన ప్రతి పాత్రలో చూపే నిజాయితీ, ఆ పాత్ర కోసం కష్టపడేతత్వాన్ని నేను అభినందిస్తాను అని తెలిపారు.