Chiranjeevi : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్నారు.

Megastar Chiranjeevi – Padma Vibushan : భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్నారు. గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ప‌ద్మ పుర‌స్కాల ప్ర‌ధానోత్స‌వం జ‌రిగింది. సినీ రంగంలో చేసిన సేవ‌ల‌కు గాను ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం మెగాస్టార్ చిరంజీవిని వ‌రించింది. ఈ వేడుక‌లో చిరంజీవి భార్య సురేఖ‌, కుమారుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, కోడ‌లు ఉపాస‌న పాల్గొన్నారు. కాగా.. చిరు ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం అందుకున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా.. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్ ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

Raayan first single : ధ‌నుష్‌ ‘రాయ‌న్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ వ‌చ్చేసింది..

చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక అవడంతో ఇప్పటికే అభిమానులు, ప్రముఖులు అందరూ అభినందనలు తెలిపారు. గత నెల 22న 67 మందికి పద్మా పురస్కారాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈరోజు మిగిలిన వారికి ఈ అవార్డుల్ని అందించారు.

ట్రెండింగ్ వార్తలు