Anand Deverakonda : అన్నయ్య పుట్టిన రోజు.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్..
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.
- Thota Vamshi Kumar
- Updated on- May 9, 2024 / 03:14 PM IST
Anand Deverakonda special wishes to brother Vijay Deverakonda
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా.. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్‌తో అన్నకు శుభాకాంక్షలు తెలియజేశాడు. చిన్నప్పటి కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.’ పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్యా..! ఎలా జీవించాలో అన్నదానికి నువ్వు ప్రత్యక్ష ఉదాహారణ. ధృఢంగా ఉండడం, క్రమశిక్షణ, విశ్వాసం, నిజాయితీ.. ఇంకా మరెన్నో నీ నుంచి నేర్చుకోవచ్చు. పడిన ప్రతిసారీ ఎంతో బలంగా తిరిగి వచ్చావు.’ అంటూ ఆనంద్ దేవరకొండ రాసుకొచ్చాడు.
MaayaOne Teaser : సందీప్ కిషన్ మాయావన్ టీజర్ రిలీజ్.. సైన్స్ ఫిక్షన్ కథతో.. అదిరిపోయే విజువల్స్‌తో..
ఇదిలా ఉంటే.. విజయ్ పుట్టిన రోజు కావడంతో రాబోయే సినిమాల అప్డేట్స్ ఇచ్చారు. మూడు పాన్ ఇండియా సినిమాల అతడి చేతిలో ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా ఒకటి కాగా.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ సినిమాగా రాజావారు రాణిగారు సినిమా ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా మరొకటి. ఇంకా ట్యాక్సీవాలా ఫేమ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో VD14 వర్కింగ్ టైటిల్ తో మూడో సినిమా తెరకెక్కనుంది.
