Jawan : ‘జవాన్’ మూవీని మహేష్ బాబుతో కలిసి చూస్తా అంటున్న షారుఖ్ ఖాన్..

జవాన్ మూవీని మహేష్ బాబుతో కలిసి చూస్తా అంటున్న షారుఖ్ ఖాన్. ఏ థియేటర్ లో చూస్తారో చెప్పండి..

Shah Rukh Khan wants to see Jawan with Mahesh Babu

Jawan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) హీరోగా తమిళ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం ‘జవాన్’. నయనతార (Nayanathara) హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమా రేపు సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ ని విష్ చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఒక ట్వీట్ చేశాడు.

Aadi Keshava : ఆదికేశవ ఫస్ట్ సింగల్ ప్రోమో రిలీజ్.. సిత్తరాల సితారావతి శ్రీలీల అంటూ వైష్ణవ..

సినిమా హిట్ కావాలంటూ, తాను కూడా మూవీని చూస్తానంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి షారుఖ్ రియాక్ట్ అయ్యాడు. “థాంక్యూ మై ఫ్రెండ్. ఈ సినిమాని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ సినిమాని ఎక్కడ చూస్తారో చెప్పండి. నేను మీతో కలిసి చూస్తాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Skanda : ‘సలార్’ తప్పుకోగానే ‘స్కంద’ కూడా వచ్చేశాడు.. రామ్ స్కంద కొత్త రిలీజ్ డేట్ ఇదే..

ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరవబోతుంది. షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. పఠాన్ ఇచ్చిన సక్సెస్ ని జవాన్ ముందుకు తీసుకు వెళ్తుందా..? లేదా..? చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు