NBK107: బాలయ్య సినిమా శాటిలైట్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న స్టార్ మా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’ తాజాగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ అంచనాలను ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ గ్లింప్స్‌లు రెట్టింపు చేశాయి.

Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి టైటిల్ పెడతారా అని అభిమానులతో పాటు ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర అఫీషియల్ టైటిల్‌ను ఈ నెల 21న అనౌన్స్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టీవీ ఛానల్ ‘స్టార్ మా’ తాజాగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అత్యంత భారీ రేటుకు బాలయ్య సినిమా శాటిలైట్ రైట్స్‌ను సదరు ఛానల్ దక్కించుకుందట.

NBK107: “సుగుణ సుందరి” అంటూ బాలయ్య మాస్ స్టెప్పులు.. NBK107 సాంగ్ లీక్!

బాలయ్య ఊరమాస్ అవతారంలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ మరోసారి అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడటు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు