Vijay Antony : కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. పాన్ ఇండియా మూవీతో..

కూతురు మరణం నుంచి కోలుకుంటున్న విజయ్ ఆంటోనీ.. ఒక సినిమాని రిలీజ్ కి సిద్ధం చేస్తూనే, మరో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.

Vijay Antony releases Hitler first look Motion Poster

Vijay Antony : ఇటీవల విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణం విజయ్ ఆంటోనీని, తన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ‘తన కూతురితో పాటు తను చనిపోయాను’ అంటూ విజయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆయన బాధ చూసిన అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ధైర్యం చెబుతూ.. ఆ బాధ నుంచి బయటకు రావాలని కోరుకున్నారు. కాగా విజయ్ ఆ విషయాన్ని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు.

Parineeti Chopra : వీడియో గిఫ్ట్ ఇచ్చి భర్తని సర్‌ప్రైజ్ చేసిన పరిణీతి చోప్రా.. ఆ వీడియో చూశారా..?

కూతురు మరణం నుంచి కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. తను నటించిన తాజా మూవీ ‘రత్తం’ రిలీజ్ కి సిద్దమవుతుండడంతో ఆ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు బయటకి వచ్చాడు. తన చిన్న కూతురు లారాతో కలిసి ఆ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. తాజాగా ఇప్పుడు మరో సినిమాకి సంబంధించిన న్యూస్ ని అనౌన్స్ చేశాడు. ‘హిట్లర్’ అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ కథని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని విజయ్ రిలీజ్ చేశాడు.

Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్‌ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..

ఈ మోషన్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఒక ట్రైన్ జర్నీలోని యాక్షన్ సీన్ ని చూపించారు. ‘రియా సుమన్’ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంటే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ధన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. పొలిటికల్ నేపథ్యంతో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు మేకర్స్ తెలియజేశారు.

ట్రెండింగ్ వార్తలు