Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా ఇంకా ఉందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. డిప్యూటీ సీఎంని కలిసాను..
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాని ప్రకటించారు.
- Saketh U
- Published On : July 28, 2024 / 12:14 PM IST
Pawan Kalyan Surender Reddy Movie Still Alive Producer Ram Talluri Interesting Comments goes Viral
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. జనసేన గెలుపు, డిప్యూటీ సీఎం అవ్వడంతో ప్రస్తుతం ఏపీలో బిజీగా ఉన్నారు. పవన్ చేతిలో ఎన్నికల ముందు ఒప్పుకున్న సినిమాలు రాజకీయాల బిజీ వల్ల పూర్తి కాలేదు. పవన్ కూడా గతంలో వీలు చూసుకొని ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేస్తానని తెలిపాడు. కానీ వాటికి సమయం పట్టేలా ఉంది. అయితే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. OG, హరిహర వీరమల్లు షూటింగ్ కి డేట్స్ ఇస్తే అయిపోతాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు ఆ సినిమా ఉంటుందో ఉండదో ఎవ్వరికి క్లారిటీ లేదు.
Also Read : Mechanic Rocky : విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ గ్లింప్స్ వచ్చేసింది.. ఇద్దరు హీరోయిన్స్ తో విశ్వక్..
అయితే వీటికంటే ముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమాని ప్రకటించారు. అసలు అందరూ ఆ సినిమాని మర్చిపోయారు కూడా. ఆల్మోస్ట్ ఆ సినిమా ఉండదు అని అంతా ఫిక్స్ అయ్యారు. తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ లో మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ సినిమా గురించి ప్రశ్నించగా రామ్ తాళ్లూరి క్లారిటీ ఇచ్చారు.
రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. మా సైడ్ నుంచి స్క్రిప్ట్ అయిపోయింది. అంతా రెడీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మా చేతిలో ఏం లేదు. అయన చేతిలోనే ఉంది. ఆయనని వారం రోజుల క్రితమే కలిసాను. ఆయన వీలు చూసుకొని సినిమాలు చేయొచ్చు అని తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా లేట్ అయినా ఉండొచ్చు అని తెలుస్తుంది. గతంలో ఈ సినిమాకి సంబంధించి సినిమాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా నిర్మాత వ్యాఖ్యలతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
