Cable Bridge: ఘోరం.. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మృతి.. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు.

Cable Bridge: గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 60 మంది మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మోర్బిలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు కూలిపోయింది.

Cable Bridge: గుజరాత్‪లో కూలిన కేబుల్ బ్రిడ్జి.. పలువురికి గాయాలు

కొంతకాలం క్రితం మూసి ఉండి, మరమ్మతులు చేసిన కేబుల్ బ్రిడ్జి ఐదు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది సందర్శకులు ఈ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. అయితే, సాయంత్రం బ్రిడ్జి ఉన్నట్లుండి కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో బ్రిడ్జిపై దాదాపు 150 మందికిపైగా ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవడంతో చాలా మంది నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో సందర్శకులు గాయపడ్డారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే అగ్నిమాకప దళం, కలెక్టర్, ఎస్పీ, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్యం కోసం అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేశారు.

India vs South Africa: ఇండియాపై దక్షిణాఫ్రికా విజయం.. మూడో టీ20లో పోరాడి ఓడిన భారత్

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడంతో చాలా మందిని రక్షించగలిగినట్లు గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘవి తెలిపారు. అలాగే సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఆదేశించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య సాయం అందించాలని ఆదేశించినట్లు అమిత్ షా తెలిపారు. గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘవి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోదీ సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు.

Food Delivery Man: ‘నీ ఫుడ్ తిన్నాను.. బాగుంది’ అంటూ కస్టమర్‌కు డెలివరీ బాయ్ మెసేజ్… ట్విట్టర్‌లో షేర్ చేసిన కస్టమర్

అత్యవసర సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా సీఎంకు సూచించారు. కేంద్రం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ బ్రిడ్జి 143 ఏళ్లక్రితం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ వంతెనను ఫిబ్రవరి 20, 1879లో ప్రారంభించారు. అప్పట్లో దాదాపు రూ.3.5 లక్షలతో నిర్మించారు. దీన్ని దాదాపు రెండేళ్లుగా మూసేసి ఉంచారు. ఐదు రోజుల క్రితమే తిరిగి ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు