August GST Collections: ఆగస్టులో 28శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. వరుసగా ఆరో నెలలో నెలవారీ జీఎస్టీ ఆదాయం ₹1.40 లక్షల కోట్లు

భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.

August GST Collections: భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో ఆరవ నెలలో రూ. 1.4లక్షల కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనే సంకేతాలకు ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు ఉదాహరణగా చెప్పొచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ తెలిపారు. ఆర్థిక పునరుద్ధరణతో పాటు స్థిరమైన ప్రతిపాదన జీఎస్టీ ఆదాయాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని అన్నారు.

GST On House Rent : ఇంటి అద్దెపై 18శాతం జీఎస్టీ..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆగస్టు 2022లో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,43,612 కోట్లు కాగా ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 24,710 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ. 30,951 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 77,782 కోట్లు (రూ. 42,067 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయని, 10,168 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 1,018 కోట్లతో కలిపి) అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్ట్ 2021లో సేకరించిన రూ. 1,12,020 కోట్ల జీఎస్టీ రాబడి కంటే 2022 ఆగస్టు నెల ఆదాయాలు 28శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అజయ్ సేథ్ పేర్కొన్నారు.

GST: విడిగా అమ్మితే వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు

ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1.7 లక్షల కోట్లు ఖర్చు చేశామని, స్థూల స్థిర మూలధన నిర్మాణం ఏప్రిల్- జూన్‌లో 34.7శాతం పెరిగిందని, ఇది పది సంవత్సరాలలో అత్యధికమని సేథ్ చెప్పారు. ఇదిలాఉంటే జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఇది రెండవ అత్యధికంమని తెలిపారు. కరోనా మహమ్మారి నేతృత్వంలోని ఆంక్షల సడలింపు తరువాత మెరుగైన కార్యకలాపాలు భౌగోళిక రాజకీయ, ప్రపంచ ఆందోళనలు ప్రభావాలను అధిగమించాయని తెలిపారు. ఒక సంవత్సరంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ, వృద్ధి రేటు రాయిటర్స్ అంచనా వేసిన 15.2 శాతం వెనుకబడి ఉండటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు