గల్లీ ఎన్నికలు కాదు కాబట్టే ఇంతవరకూ వచ్చాం: అమిత్ షా

GHMC ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ పలువురు కీలక నేతలు హైదరాబాద్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. యోగి, జేపీ నడ్డాలతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన షా.. పలు కీలక కామెంట్లు చేశారు.

రోడ్ మీద అంగుళం కూడా ఖాళీ లేదు.. దీనిని బట్టే తెలుస్తుంది మేయర్ అధికార పీఠం మాదేనని. ఐటీ సంస్థల ఏర్పాట్లు చూడటం అనేది మునిసిపల్ కార్పొరేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. మేం గెలిస్తే మరింత అభివృద్ధి చేస్తాం.

టీఆర్ఎస్, మజ్లిస్ నేతృత్వంలో జరిగిన ఏర్పాట్లతో వరద నీరు వారి ఇంటి పక్కనే నిలిచిపోయింది. ఇన్నేళ్లుగా వాటి కోసం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. అలాంటప్పుడు నిండిపోక ఏం జరుగుతుంది.

హైదరాబాద్ ప్రజలకు ఇదే నమ్మకమిస్తున్నా.. ఒకసారి బీజేపీని అధికారంలోకి రానివ్వండి. ఇంకెప్పుడూ నీళ్లలో మునిగిపోయే పరిస్థితి రానివ్వం. కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం ఎక్కడ.. ఒవైసీ ఎక్కడున్నారు. హైదరాబాద్ లో మంచి పాలన అందిస్తామని మాటిస్తున్నా. మోడీ ఏం చెప్పారో అది చేసి చూపిస్తారు.. 2014లో చెప్పింది చేశాం.. 2019లో చెప్పిందే ఇప్పుడు చేస్తున్నాం.

100రోజుల పని కోసం మాటిచ్చారు. 35వేల నల్లా కనెక్షన్లు అని చెప్పారు. పేదల కోసం లక్ష ఇళ్లు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజల కోసం ఆరు లైన్ల రోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. 15 డంప్ యార్డ్ లు అని చెప్పారు. అవెక్కడ కనిపించడం లేదు. ఇవన్నీ పూర్తి చేస్తామని 10వేల కోట్ల ప్రాజెక్టును మా ముందుకు తీసుకొచ్చారు.. ఏది

హుస్సేన్ సాగర్‌ను టూరిస్ట్ స్పాట్‌గా చేస్తామని అలా వదిలేశారు. హైదరాబాద్‌లోని పేదలకు అనుకోని కారణంగా అనారోగ్యం పాలైతే రూ.5లక్షల వరకూ ఆరోగ్య సదుపాయం ఉంటుంది. అది అందుతుందా..

హైదరాబాద్ లోని పేదల కోసం వీధి వ్యాపారుల (పీఎం స్ట్రీట్ వెండర్ యోజన) తీసుకొచ్చాం. ఇది కేవలం తెలంగాణకే దక్కింది. అది కూడా హైదరాబాద్ లోని వ్యక్తులకే ఎక్కువ దొరికింది. వర్క్ ఫ్రమ్ హోం.. తో పాటు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ కూడా మోడీ కల్పించారు. నిజాం పాలనా సంస్కృతి నుంచి విముక్తి తీసుకొచ్చి మినీ భారత్‌లా చేద్దామనుకుంటున్నాం.

టీఆర్ఎస్ ను ఒకటే ప్రశ్నిస్తున్నాం.. మీ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ మేధావులు లేరా. మజ్లిస్‌తో కలిసి పనిచేస్తున్నారు.. మీరు ఎలాగైనా పొత్తులు పెట్టుకోండి మాకు ఇబ్బందేం లేదు. అలాంటప్పుడు సీక్రెట్ గా ఎందుకు చేస్తున్నారు. ధైర్యంగా ఎందుకని మీ ఒప్పందం చెప్పలేకపోతున్నారు.

భారతీయ జనతా పార్టీ కేవలం మునిసిపల్ ఎన్నికల కోసమే కాదు.. గల్లీ ఎన్నికలు అనుకోవడం లేదు కాబట్టే ఇక్కడ వరకూ వచ్చాం.

500కోట్ల వరకూ సచివాలయం కోసం ఇచ్చాం. రెగ్యూలర్ గా వెళ్తేనే కదా తెలిసేది. మేం హైదరాబాద్ డెవలప్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావడం లేదు కదా.

హైదరాబాద్ ను తెలంగాణలో కలపాలనుకున్నది ఎవరో అందరికీ తెలుసు. ఆ ప్రశ్న ఒవైసీని అడగండి. అందరినీ ఒకేలా చూస్తున్నాం. ప్రతీ సంక్షేమాన్ని అందరికీ ఒకేలా అందిస్తున్నాం. కరప్షన్ తగ్గిపోయినప్పుడు డెవలప్‌మెంట్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది.

కిసాన్ ఆందోళన రాజకీయం చేయాలనుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం ఉంది. హైదరాబాద్ ఎన్నికలు మేం గల్లీ ఎన్నికలుగా భావించడం లేదు. అలా అనుకుంటే గల్లీని శుభ్రం చేసి ఉంటే మేం ఇక్కడ వరకూ వచ్చేవాళ్లం కాదు.

అంటూ కౌంటర్లు వేశారు అమిత్ షా.

ట్రెండింగ్ వార్తలు