పార్టీల ఉచిత హామీలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంచ్ డైలాగులు

విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Venkaiah Naidu : మాజీ మంత్రి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి చేతులుమీదుగా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. నేను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా. అందుకే రాలేదని చెప్పారు. ఇకపై ప్రజలతో ఉంటా. ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్నకూడా ప్రధానితో చర్చించా. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లను. సాధారణ రాజయకీయాల గురించి స్పందిస్తు ఉంటా. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తా, కళాశాలలు, యూనివర్సిటీలు, ఐఐఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానని వెంకయ్య నాయుడు చెప్పారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు భారీగా బందోబస్తు.. తెలంగాణకు 160 కంపెనీల కేంద్ర బలగాలు

పార్టీలు మారడం ట్రెండ్ గా మారింది..
ప్రజా జీవితంలో ప్రతిఒక్కరూ యాక్టివ్ గా ఉండాలి. ఎవరి పనివారు సక్రమంగా చేయడమే దేశ భక్తి. నేతలు పార్టీలు మారడం ట్రెండ్ గా మారింది. ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్. పదవికి రాజీనామాచేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదని వెంకయ్య నాయుడు అభిప్రాయ పడ్డారు. యాంటీ డిఫెక్షన్ లా ను బలోపేతం చేయాలని అన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని వెంకయ్య నాయుడు అన్నారు.

Also Read : ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. బ్యాగు తీసుకెళ్తున్నారా?

జీవితంలో గొప్ప అంశం అదే..
పార్టీకి నేను ఇచ్చే స్థానం నా జీవితంలో మారదు. ఆర్టికల్ 370 రద్దు నేను రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశం. లోక్ సభలో మెజార్టీ ఉన్నా మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో సభను వాయిదా వేయకుండా నడిపించా. శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్య యుతంగా ఆర్టికల్ 370రద్దు బిల్లు ఆమోదం పొందింది. రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సరిగా జరిగేలా ట్రెయిన్ చెయ్యాలి. దేశం రోజురోజుకు ముందుకు వెళ్తుంది. శత్రు దేశాలు భారత్ ను చూసి ఓర్చుకోలేక పోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఓటర్లు తమ ఓటర్ స్లిప్ వెరిఫై చేసుకోవాలి. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయండి.. ప్రజలంతా ఓటింగ్ లో తప్పకుండా పాల్గొనండి అంటూ వెంకయ్య నాయుడు సూచించారు.

Also Read : వైసీపీ పథకాలను చంద్రబాబు తొలగిస్తారని ప్రజలు భావిస్తున్నారు : బాలినేని శ్రీనివాస రెడ్డి

ఉచితాలపై పంచ్ డైలాగులు..
రాజకీయ పార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలి. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవం. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా ఉచితాల హామీలు ఇస్తున్నాయి. విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఖజానాపై పడే భారం లెక్కించకుండా ఉచిత పథకాలు ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడానికి నిధులులేక అప్పులు చేయడం.. ఇదెక్కడి విధానం. ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలని వెంకయ్య నాయుడు సూచించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు