వైసీపీ పథకాలను చంద్రబాబు తొలగిస్తారని ప్రజలు భావిస్తున్నారు : బాలినేని శ్రీనివాస రెడ్డి

చంద్రబాబు అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాలు తీసేస్తాడని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో జగన్ నినాదాలు వినబడుతున్నాయి. 

వైసీపీ పథకాలను చంద్రబాబు తొలగిస్తారని ప్రజలు భావిస్తున్నారు : బాలినేని శ్రీనివాస రెడ్డి

Balineni Srinivasa Reddy: టీడీపీ అధికారంలోకి వస్తే వైసీపీ పథకాలను చంద్రబాబు నాయుడు తొలగిస్తారని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వైసీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. జగన్ నాయకత్వంలో ఆయన అండతో 6వ సారి ఒంగోలులో గెలవబోతున్నానని అన్నారు.

7వ సారి ఒంగోలు బరిలో నిలబడుతున్నాను. నేను ఆరవ సారి గెలిచి సిక్స్ కొట్టబోతున్నాను. నేను గెలిస్తే ఒంగోలులో ప్రజలకు డైలీ తాగునీరు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్, నివాసం వంటి వాటిని అందించడమే నా ప్రధాన ఎజెండగా పెట్టుకున్నాను. చంద్రబాబు అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వ పథకాలు తీసేస్తాడని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో జగన్ నినాదాలు వినబడుతున్నాయి. ఎన్నిలను అధికారులు పక్షపాతం లేకుండా నిస్పక్షపాతంగా జరపాలని కోరుతున్నాను. వైసీపీ క్యాడర్ ను టీడీపీ రెచ్చగొట్టాలనీ చూస్తోందని బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు.

Also Read: పవన్ క‌ల్యాణ్‌కు పిచ్చి ముదిరింది.. చిరంజీవి పక్కా కమర్షియల్: గ్రంధి శ్రీనివాస్ ఫైర్

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు భారీగా హాజరైయ్యాయి.

నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆర్డీవో కార్యాలయంలో ఆదాల ప్రభాకరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

విజయనగరం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి సమర్పించారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఆలయాలు, దర్గా, చర్చలో ఎమ్మెల్యే ప్రార్థనలు చేశారు. శివప్రసాద్ రెడ్డి వెంట మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర డైరెక్టర్లు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. డోన్ లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.