Nitrogen Smoked Biscuits : తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్.. పిల్లలకు స్మోకింగ్ బిస్కెట్లు తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో చూడండి..

ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది అని నిపుణులు అంటున్నారు. పిల్లలను నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.

Nitrogen Smoked Biscuits : ఇది తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాటి చెప్పే ఘటన. లేదంటే మీ పిల్లల చావుకి మీరే కారణం కావాల్సి ఉంటుంది. అసలేం జరిగిందంటే.. నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్స్ ఓ బాలుడి ప్రాణం తీశాయి. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో జరిగినట్ల తెలుస్తోంది. ఓ ఎగ్జిబిషన్ కు పిల్లలతో కలిసి వెళ్లిన తల్లిదండ్రులు అక్కడ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో వారికి ఓ స్టాల్ కనిపించింది. అక్కడ నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లు అమ్ముతున్నారు. నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్ అంటే.. అది పొగలు కక్కుతూ ఉంటుంది. దాన్ని ఓ కప్పులో ఇస్తారు. నోట్లో వేసుకోగానే.. నోటి నుంచి పొగలు వస్తాయి. ఇది చాలా సరదాగా ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్ గానూ ఉంటుంది. అందుకే, పిల్లలే కాదు పెద్దలు కూడా అట్రాక్ట్ అవుతారు.

అయితే, ఈ సరదానే విషాదం నింపింది. ఎగ్జిబిషన్ కు వెళ్లిన తల్లిదండ్రులు.. తమ పిల్లాడికి నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్ ఇప్పించారు. బాబు దాన్ని నోట్లో వేసుకున్నాడు. అతడి నోటి నుంచి పొగలు రావడం చూసి తల్లిదండ్రులు ఎంజాయ్ చేశారు. బాబు తల్లి అదంతా వీడియో తీస్తోంది. ఇంతలో బాలుడు పెద్దగా కేకలు వేయడం ప్రారంభించాడు. నొప్పితో విలవిలలాడాడు. అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. బాధతో విలవిలలాడాడు. దీంతో తల్లిదండ్రులు కంగారు పడిపోయారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనకు గురయ్యారు. చూస్తుండగానే బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ మరుక్షణమే ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందు తమ బాబు చనిపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే గడ్డకట్టే స్వభావం కలిగున్న లిక్విడ్ నైట్రోజన్‌ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల బాలుడు మరణించినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది అని నిపుణులు అంటున్నారు. పిల్లలను నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం అని, పిల్లలను ప్రాణాలు తీస్తుందని హెచ్చరించారు. సరదా కోసమో, ఎగ్జైట్ మెంట్ కోసమే.. పిల్లలకు స్మోక్డ్ బిస్కెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.

నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లు ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. అందులో నుంచి వచ్చే పొగలు చూసి అంతా దానికి అట్రాక్ట్ అవుతున్నారు. పిల్లలు మరీ ఎక్కువగా దీన్ని ఇష్టపడుతున్నారు. అయితే వాటి కారణంగా జరిగే అనర్ధాలను ఎవరూ గ్రహించడం లేదు. పిల్లల ప్రాణాలకే ప్రమాదంగా మారుతోంది. చెన్నైలో అలాంటి ఘోరమే జరిగింది. ఆ బిస్కెట్ తిని తీవ్ర అనారోగ్యానికి గురై పిల్లాడు చనిపోయాడు. నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లు లిక్విడ్ నైట్రోజన్‌ కలిగి ఉంటుందని, ఈ పదార్ధం చాలా ప్రమాదకరం అని అంటున్నారు. సాధారణంగా ఎగ్జిబిషన్స్ లేదా ఫెయిర్స్ కు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల స్టాల్స్ కనిపిస్తాయి. అందులో నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్స్ స్టాల్ కచ్చితంగా ఉంటోంది.

Also Read : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో

నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లు.. పిల్లలకే కాదు పెద్దలకూ చాలా ప్రమాదమే. వారి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. పొగబెట్టిన ఉత్పత్తులు భయంకరమైన పరిణామాలకు దారితీస్తున్నాయి. గతంలో గురుగ్రామ్‌లో ఇదే విధమైన ఘటన ఒకటి జరిగింది. ఓ వ్యక్తి నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్ తీసుకుని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. దాని దుష్ప్రభావాల కారణంగా అతని కడుపులో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది.

నత్రజని ఆవిరిని (నైట్రోజన్ వేపర్) వెదజల్లడానికి ముందు అటువంటి ఉత్పత్తులను తీసుకోకపోవడమే మేలు అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఇది ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందన్నారు. శ్వాస ఆడకపోవడం, కడుపు నొప్పి, ఇతర భయంకరమైన లక్షణాలు బాధితుల్లో కనిపిస్తాయి.

పిల్లాడి ప్రాణం తీసిన నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్..

ట్రెండింగ్ వార్తలు