Software Engineer Dies : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్

ఈ దారుణం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Software Engineer Dies : హాస్టల్‌లో ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్

Software Engineer Incident

Software Engineer Dies : హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ హాస్టల్ యజమాని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. 24 ఏళ్లకే ఆ యువకుడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. నీటి సంపులో పడి 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్య నగర్ లోని ఒక హాస్టల్ లో ఈ ఘోరం జరిగింది. వాటర్ సంపు పైకప్పు తెరిచి ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంపులో పడిన వెంటనే తలకు బలమైన గాయం అవ్వడంతో సాప్ట్ వేర్ ఉద్యోగి సంపులోనే చనిపోయాడు. సంపుపై కప్పు పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఈ దారుణం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాయదుర్గం పోలీసులు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బయటి నుంచి ఏదో కొనుగోలు చేసి హాస్టల్ లోపలికి వచ్చాడు. గేటు తెరుచుకుని లోనికి వచ్చిన అతడు.. చూసుకోకుండా ముందుకు కదిలాడు. అదే సమయంలో నీటి సంపు మూత తెరిచి ఉంది. ఆ యువకుడు దీన్ని గమనించలేదు. అంతే.. ఒక్కసారిగా సంపులోకి పడిపోయాడు. ఆ వెంటనే తీవ్ర గాయంతో సంపులోనే మృత్యుఒడికి చేరాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. హాస్టల్ యజమాని నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొందని స్థానికులు కంటతడి పెట్టారు. ఓ వ్యక్తి ప్రాణం పోయేందుకు కారణమైన హాస్టల్ యాజమానిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : బాబోయ్.. చాక్లెట్లు తిని రక్తం కక్కుకుని చిన్నారి మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాకే