నాలుగో విడత ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు

నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది.

Lok Sabha elections 2024 Phase 4 Nominations: నాలుగో విడత ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే గడువు నేటితో ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్, జమ్మూకశ్మీర్ లోని పలు లోక్‌స‌భ స్థానాలకు నాలుగో విడతలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశ ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మే 13నే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

7 రోజుల పాటు నామినేషన్ల పర్వం
ఈనెల 18 నుంచి ఈరోజు వరకు కొనసాగిన నామినేషన్ల పర్వం
మొత్తం 7 పనిదినాల పాటు నామినేషన్లు
26న నామినేషన్ల పరిశీలన
ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ
29 సాయంత్రం అభ్యర్థుల జాబితాను విడుదల
వచ్చే నెల మే 13న ఎన్నికల పోలింగ్..
జూన్ 4న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ఫలితాలు

తెలంగాణలో నామినేషన్లు ఇలా..
నిన్నటి వరకు తెలంగాణలో 547 మంది నామినేషన్లు
నిన్నటివరకు 856 సెట్ల నామినేషన్లు దాఖలు
నిన్నటి వరకు అత్యధికంగా మల్కాజిగిరి లో 53 మంది నామినేషన్
మల్కాజిగిరి తరువాత భువనగిరి లో 45 మంది నామినేషన్
నిన్నటి వరకు చేవెళ్లలో 44 మంది నామినేషన్
నిన్నటి వరకు అత్యల్పంగా అదిలాబాద్ లో 12 మంది నామినేషన్

Also Read: కేరళలో ఆసక్తికరంగా ట్రయాంగిల్ ఫైట్.. పట్టు సాధించేందుకు కమలం పార్టీ ఎత్తులు

ట్రెండింగ్ వార్తలు