Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్‭ను కలిసిన ముస్లిం నేతలపై మండిపడ్డ ఓవైసీ

ఎంతో తెలివైన వారమైని, తమకన్నీ తెలుసని అనుకునే ఈ ఉన్నతమైన వ్యక్తులకు వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదు. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఆర్ఎస్ఎస్ అధినేతను కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది వారి ప్రజాస్వామ్య హక్కు కూడా. వారి హక్కును మేం కాదనట్లేదు. అలా అని వారిని మేము ప్రశ్నించడమూ లేదు. కానీ మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు

Asaduddin Owaisi: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్‭ను ముస్లిం నేతలు కలుసుకోవడంపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత నెలలో మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఛాన్స్‭లర్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వాని అనే ఐదుగురు నేతలతో మోహన్ భాగవత్‭ సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ విషయమై తాజాగా స్పందించిన ఓవైసీ.. ‘‘వీరు (ఐదుగురు ముస్లిం నేతలు) వెళ్లి మోహన్ భాగవత్‭ను కలిశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలిసి కూడా వీరు కలిశారు. ముస్లింలలో ఉన్నత కుటుంబాలైన వీరు ఏం చేసినా అది సభ్యంగానే ఉంటుంది. అదే ప్రాథమిక హక్కుల కోసం మేం రాజకీయంగా పోరాడితుంటే మమ్మల్ని మాత్రం తప్పుడుగా చిత్రీకరిస్తారు’’ అంటూ మండిపడ్డారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఎంతో తెలివైన వారమైని, తమకన్నీ తెలుసని అనుకునే ఈ ఉన్నతమైన వ్యక్తులకు (ఐదుగురు ముస్లిం నేతలు) వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదు. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఆర్ఎస్ఎస్ అధినేతను కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది వారి ప్రజాస్వామ్య హక్కు కూడా. వారి హక్కును మేం కాదనట్లేదు. అలా అని వారిని మేము ప్రశ్నించడమూ లేదు. కానీ మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు’’ అని విరుచుకపడ్డారు.

Congress President Election: రాహుల్ తప్పుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరుగుతోన్న పోటీ

ట్రెండింగ్ వార్తలు