Mohan Bhagwat: మసీదును సందర్శించిన RSS చీఫ్.. హిందూ, ముస్లిం DNA ఒకటే అంటూ స్టేట్‭మెంట్!

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ.. ముస్లింలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే తీవ్ర విమర్శల నేపథ్యంలో.. భాగవత్ ఇలా వరుస బెట్టి ముస్లిం పెద్దలను, నేతలను కలుసుకోవడం దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారి తీసింది.

Mohan Bhagwat: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ కొద్ది రోజులుగా ముస్లిం మత పెద్దల్ని, నేతల్ని, ప్రముఖుల్ని కలుస్తున్నారు. తాజాగా ఆయన మరో అడుగు ముందుకు వేసి.. ఢిల్లీలోని ఒక మసీదును సందర్శించించడం విశేవషం. అనంతరం ఆ మసీదు పెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసితో ప్రత్యేకంగా కాసేపు చర్చించారు. గంటకు పైగా వీరి సమావేశం జరిగింది.

కాగా, ఈ సమావేశంపై ఇల్యాసి కుమారుడు సుహైబ్ మాట్లాడుతూ ‘‘దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఈ సమావేశం పంపనుంది. ఒక కుటుంబం లాగే మేము కలుసుకుని మాట్టాడుకున్నాం. మా ఆహ్వానం మేరకు వారు (మోహన్ భాగవత్) రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ఇక ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి సునిల్ అంబేద్కర్ మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ (చీఫ్) అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటారు. ఇది నిరంతర సాధారణ ‘సంవాద్’ (చర్చ) ప్రక్రియలో భాగం’’ అని పేర్కొన్నారు.

EC Report : 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం కోసం రూ.340 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ : ఈసీ రిపోర్టులో వెల్లడి

అయితే తాజా సమావేశంలో ముస్లింలు, హిందువుల డీఎన్ఐ ఒకటేనని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ ప్రశ్నపై అహ్మద్ ఇల్యాసిని ప్రశ్నించగా.. మోహన్ భాగవత్ జాతీయ పిత (రాష్ట్రపిత) అని, ఆయన చెప్పింది వాస్తవామని సమాధానం ఇచ్చారు. గత నెలలో ఐదుగురు ముస్లిం నేతలను మోహన్ భాగవత్ కలుసుకున్నారు. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్.వై.ఖురేషి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఛాన్స్‭లర్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానిలతో గత నెలలో భాగవత్ సమావేశమయ్యారు.

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు, కర్ణాటకలో హిజాబ్ వివాదం వివాదాల నేపథ్యంలో దేశంలో మత పరమైన హింసలు చెలరేగకుండా, శాంతియుత వాతావరణం కాపాడే ఉద్దేశంలో ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ.. ముస్లింలకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే తీవ్ర విమర్శల నేపథ్యంలో.. భాగవత్ ఇలా వరుస బెట్టి ముస్లిం పెద్దలను, నేతలను కలుసుకోవడం దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారి తీసింది.

Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు