Mayawati on Budget2023: పార్టీ కోసం కాకుండా దేశం కోసం పెట్టుంటే బాగుండేది.. కేంద్ర బడ్జెట్‭పై మాయావతి సెటైర్స్

దేశంలో గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశలు వర్షం అనేకం కురిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వారు ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రకటనలు, వాగ్దానాలు ఉపయోగపడటం లేదు. పేదరికం, నిరుద్యోగం మొదలైనవి అలాగే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దిగువ మధ్యతరగతి మరింత దిగువకు పడపోతోంది

Mayawati on Budget2023: ఒక పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా దేశం కోసం బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేదంటూ బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి సెటైర్లు గుప్పించారు. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం, ఆమె స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 100 కోట్లకు పైగా పేద ప్రజలు ఉంటే, బడ్జెట్ మాత్రం కొందరి ప్రయోజనాలకే ఉంటోందని, ఏదైనా పేద వర్గం కోసం కొన్ని కేటాయింపులు జరిగినా, వాటిని ఖర్చు చేయడంలో వెనకడుగు వేస్తున్నారని మండిపడ్డారు.

Gautam Adani : అయ్యో అదానీ.. మరింత దిగజారాడు, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 నుంచి ఔట్

ప్రతి ఏడాది ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోన్న రైతులు, కూలీలు, మహిళలు, వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగులకు నిరాశే మిగులుతోందని మాయావతి అన్నారు. గత దశాబ్ద కాలంగా బడ్జెట్‭లు వస్తున్నాయి, పోతున్నాయి కానీ, ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని ఆమె దుయ్యబట్టారు. ఈ ఏడాది బడ్జెట్ కూడా అలాగే ఉందని, కేంద్రంలోని బీజేపీకి పేద ప్రజల మీద కనీస పట్టింపు లేదని ఆమె మండిపడ్డారు.

Budget 2023: నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‭లోని హైలైట్స్

‘‘దేశంలో గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లు వస్తూనే ఉన్నాయి. అందులో ప్రకటనలు, వాగ్దానాలు, వాదనలు, ఆశలు వర్షం అనేకం కురిపిస్తూనే ఉన్నారు. అయితే భారతదేశంలోని మధ్యతరగతి వారు ద్రవ్యోల్బణ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రకటనలు, వాగ్దానాలు ఉపయోగపడటం లేదు. పేదరికం, నిరుద్యోగం మొదలైనవి అలాగే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దిగువ మధ్యతరగతి మరింత దిగువకు పడపోతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా పెద్దగా తేడా లేదు. ఏ ప్రభుత్వమూ గత ఏడాది లోపాలను ఎత్తి చూపి మళ్లీ కొత్త వాగ్దానాలు చేయడం లేదు. ఎన్ని బడ్జెట్‌లు వచ్చినా వాస్తవ పరిస్థితిలో 100 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలు మునుపటిలాగా ప్రమాదంలోనే ఉన్నాయి. ప్రజలు ఎన్నో ఆశలతో జీవిస్తారు. మరి వారి ఆశలు నెరవేరేదెన్నడు?’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్

‘‘ప్రభుత్వ సంకుచిత విధానాలు, తప్పుడు ఆలోచనలు కోట్లాది మంది పేద రైతులు, గ్రామీణ భారతదేశంతో శ్రమజీవుల జీవితాలపై చాలా దుష్ప్రభావాలను చూపుతున్నాయి. సామాన్యుల జేబులు నింపి దేశం అభివృద్ధి చెందాలంటే వారి ఆత్మగౌరవం, స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పథకం లబ్ధిదారుల లెక్కల గురించి కేంద్రం మాట్లాడినప్పుడల్లా, భారతదేశం సుమారు 130 కోట్ల మంది పేదలు, కూలీలు, నిరుపేదలు, రైతులు మొదలైన వారి అమృత్‌కాల్ కోసం తహతహలాడే విశాల దేశమని గుర్తుంచుకోవాలి. పార్టీ కంటే దేశం కోసం బడ్జెట్ పెట్టి ఉంటే బాగుండేది’’ అని మాయావతి వరుస ట్వీట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు