Bihar: టీచర్ అభ్యర్థులపై పోలీసు అధికారుల అమానుష దాడి.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

అక్కడే ఉన్న ఏడీఎం కేకే సింగ్.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని అభ్యర్థిని పైశాచికంగా కొట్టాడు. అయినప్పటికీ సదరు అభ్యర్థి నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో తనకు బలమైన దెబ్బలు తగిలాయని అనిపించింది. తన తల నుంచి రక్తం కారడాన్ని గమనించాడు. తలకు రెండు చేతులు అడ్డుపెట్టుకుని అలాగే రోడ్డు మీద దొర్లుతూ ఉండిపోయాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Bihar: ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవ్వడంపై బిహార్‭లోని ఉపాధ్యాయ అభ్యర్థులు నిర్వహించిన నిరసన తీవ్ర ఉద్రిక్తమైంది. రాజధాని పాట్నాలో చేపట్టిన ర్యాలీలో టీచర్ అభ్యర్థులపై పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తున్నాయి. ఒక వీడియోలో జెండా పట్టుకుని ఉన్న ఒక అభ్యర్థిని పాట్నా అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కేకే సింగ్ స్వయంగా చితకబాదడం, అతడి తల నుంచి రక్తం కారడం పట్ల నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజెన్లు షేర్ చేస్తున్న వీడియో ప్రకారం.. నిరసన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జ్ చేయడం ప్రారంభించారు. దెబ్బలు తాళలేక కొందరు, భయంతో కొందరు పరుగులు పెడుతున్నారు. ఇందులో ఒక అభ్యర్థి మాత్రం ధర్నాకు బైఠాయించి కూర్చున్నాడు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. కొంత మంది పోలీసులు అతడిని లాక్కెల్లారు. అతడు జాతీయ జెండాను తన చేతిలో పెట్టుకుని అలాగే రోడ్డు మీద పడుకుని నిరసన తెలుతపుతున్నాడు.

అక్కడే ఉన్న ఏడీఎం కేకే సింగ్.. పోలీసుల నుంచి లాఠీ తీసుకుని అభ్యర్థిని పైశాచికంగా కొట్టాడు. అయినప్పటికీ సదరు అభ్యర్థి నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో తనకు బలమైన దెబ్బలు తగిలాయని అనిపించింది. తన తల నుంచి రక్తం కారడాన్ని గమనించాడు. తలకు రెండు చేతులు అడ్డుపెట్టుకుని అలాగే రోడ్డు మీద దొర్లుతూ ఉండిపోయాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

కాగా, ఏడీఎం తీరుపై ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏడీఎంను ఆదేశించారు. అంతే కాకుండా లాఠీ చార్జ్‭లో గాయపడ్డ అభ్యర్థికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు జరిగిన నిరసన సహా లాఠీ చార్జ్‭పై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించినట్లు తేజశ్వీ కార్యాలయం పేర్కొంది.

Manish Sisodia on BJP: నన్ను మరో షిండే అవ్వమన్నారు, ఆప్‭ను చీలిస్తే సీఎం పదవి ఇస్తారట.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు

ట్రెండింగ్ వార్తలు