Karnataka Polls: ఖర్గే హత్యకు బీజేపీ ప్లాన్.. కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.. స్పందించిన సీఎం

దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.

Karnataka Polls: తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను, ఆయన కుటుంబాన్ని హతమర్చడానికి బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఖర్గేను చంపేలంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు. చిట్టాపూర్ బీజేపీ అభ్యర్థి మణికాంత రాథోడ్.. ఖర్గేను తిడుతున్నట్టుగా ఆడియో ఉంది. అంతేకాదు ఖర్గేను, ఆయన కుటుంబాన్ని అంతమొందించాలన్న మాటలు కూడా వినబడ్డాయి.

మోదీ మౌనం అందుకే..
ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిని చంపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మణికాంత రాథోడ్ (Manikanta Rathod).. ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బొమ్మైకు సన్నిహితుడని తెలిపారు. అందుకు ఈ విషయంలో ప్రధాని మోదీ, కర్ణాటక పోలీసులు, ఎన్నికల సంఘం మౌనంగా ఉందని.. కానీ కర్ణాటక ప్రజలు అంతా చూస్తున్నారని, సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. పవన్ ఖేరా కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

సీరియస్‌గా తీసుకుంటామన్న సీఎం
కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, లోతుగా విచారణ చేపట్టిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. కాగా, చిట్టాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే తనయుడు ప్రియాంక్ (Priyank Kharge) పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మణికాంత రాథోడ్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు.

ముమ్మరంగా ప్రచారం
కాగా, కర్ణాటక ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ శనివారం బెంగళూరులో మెగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బీజేపీ ప్రధాన నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు కాంగ్రెస్, జేడీ(ఎస్) కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది.

Also Read: ఇంకా ఎన్నికలే జరగలేదు, అప్పుడే ఓటమి బాధ్యత తీసుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

ట్రెండింగ్ వార్తలు