Debts : అపరిమిత అప్పులతో చేటు.. శ్రీలంకను ప్రస్తావిస్తూ ఏపీ, తెలంగాణకు కేంద్రం చురకలు

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణకు చురకలు అంటించింది.

Debts : శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంకతో పాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాల అప్పులను కేంద్రం ప్రస్తావించింది. శ్రీలంక ప్రస్తావన తెస్తూ ఏపీ, తెలంగాణకు కేంద్రం చురకలు అంటించింది. అపరిమిత అప్పులు రాష్ట్రాలకు చేటు చేస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

శ్రీలంకలో ప్రస్తుత దుస్థితికి రాజకీయాలు, అపరిమిత అప్పులే కారణం అని కేంద్ర ప్రభుత్వం ప్రజంటేషన్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసిన అప్పులను వివరించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అపరిమిత అప్పులు చేటు చేస్తాయని వివరించింది. అయితే కేంద్రం వివరణను టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేసిన అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు