INDIA 3rd Meet: ముంబై సమావేశంలో పెద్ద డ్రామా.. ఒక్కసారిగా ప్రత్యక్షమైన కపిల్ సిబాల్, కస్సుబుస్సన్న కాంగ్రెస్ నేతలు

సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.

Kapil Sibal: ముంబయిలో జరిగిన ఇండియా కూటమి రెండో సమావేశాల్లో విపక్ష పార్టీ నేతలంగా ఉత్సాహంగా పాల్గొన్న రాబోయే ఎన్నికల నాటిని బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే దానిపై చర్చలు జరిపారు. అయితే మీటింగ్ సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా అసౌకర్యానికి గురయ్యారు. కారణం.. ఒక్కసారిగా అక్కడికి కపిల్ సిబాల్ రావడం. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న సిబాల్.. కొద్ది రోజుల క్రితమే పార్టీని వీడారు. అప్పటి నుంచి పార్టీ నేతలకు కూడా దూరంగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా అక్కడ కనిపించడంతో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

INDIA 3rd Meet: ప్రధాని అభ్యర్థి లేరు, కన్వీనర్‭ లేరు.. అసంపూర్తిగా ముగిసిన ఇండియా కూటమి సమావేశాలు

సమావేశాల రెండవ రోజైన శుక్రవారం నాటి ఫోటో సెషన్‌ జరుగుతుండగా సిబాల్ ప్రత్యక్షమయ్యారు. ఎవరికీ అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ చెప్పినప్పటికీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు ఫిర్యాదు చేశారు. సమావేశానికి హాజరయ్యే సభ్యుల జాబితాలో కపిల్ సిబాల్ పేరు లేదు. అయితే సమావేశానికి ముందు ఫోటో సెషన్ సమయంలో ఆయన కనిపించారు. అయితే ఆగ్రహానికి గురైన కేసీ వేణుగోపాల్ ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా ఒప్పించేందుకు ప్రయత్నించారు.

కపిల్ సిబల్ పాల్గొనడంపై కెసి వేణుగోపాల్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
కపిల్ సిబల్ గతంలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉండేవారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన 2022 మేలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు ఎంపికయ్యారు. పార్టీ మార్పుపై సహజంగానే ఆ పార్టీ నేతలకు ఆగ్రహం వస్తుంది. అందులో భాగంగానే సిబాల్ మీద వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు