Carlos Brathwaite Hits Helmet With Bat After Getting Out During Max60 Caribbean
Carlos Brathwaite : వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కార్లోస్ బ్రాత్‌వైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ తన పని చక్కగా పూర్తి చేసుకుంటూ ఉంటాడు. అయితే.. తాజాగా అతడు సహనం కోల్పోయాడు. ఓ టీ10 లీగులో అతడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Max60 కరేబియన్ టీ10 లీగ్‌లో న్యూయార్క్ స్ట్రైకర్స్ తరుపున బ్రాత్‌వైట్ ఆడుతున్నాడు. గ్రాండ్ కేమన్ జాగ్వార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ సహనం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 8.2 ఓవర్ లో ఇది చోటు చేసుకుంది. జోష్ లిటిల్ బౌలింగ్‌లో బ్రాత్ వైట్ షాట్ ఆడాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఫీల్డర్లు ఔట్ అంటూ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనిపై బ్రాత్‌వైట్ అసహనం వ్యక్తం చేశాడు.
PAK vs BAN : ఓరి నాయనో.. షకీబ్‌కు కోపం తెచ్చావుగా.. జస్ట్ మిస్.. తల పగిలేదిగా రిజ్వాన్..!
నిరాశతో పెవిలియన్‌కు వెలుతూ.. తన హెల్మెట్‌ను తీసి బ్యాట్‌తో గట్టిగా కొట్టాడు. దీంతో హెల్మెట్ కాస్త బౌండరీ లైన్ ఆవల పడి ముక్కలైంది. అక్కడితో అతడు ఆగలేదు. డగౌట్‌లోకి వెలుతూ బ్యాట్‌ను విసిరివేశాడు. కాగా.. రిప్లేలో బంతి అతడి బ్యాట్‌కు కాకుండా భుజానికి తగిలినట్లుగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాము ఎప్పుడు కూడా బ్రాత్‌వైట్‌ను ఇలా చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వెస్టిండీస్ జట్టు 2016లో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కార్లోస్ బ్రాత్‌వైట్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ పై ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది వెస్టిండీస్‌కు నమ్మశక్యం గానీ విజయాన్ని అందించాడు. వెస్టిండీస్ తరుపున బ్రాత్ వైట్ మూడు టెస్టులు, 44 వన్డేలు, 41 టీ20 మ్యాచులు ఆడాడు.
MS Dhoni : ధోని భయ్యా.. అది క్రికెట్ బాల్ కాదు.. కాస్త చిన్నగా కొట్టవయ్యా..
— Cric guy (@Cricguy88) August 25, 2024