PAK vs BAN : ఓరి నాయనో.. షకీబ్‌కు కోపం తెచ్చావుగా.. జస్ట్ మిస్.. తల పగిలేదిగా రిజ్వాన్..!
బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన సహనాన్ని కోల్పోయాడు.

Shakib al Hasan Loses Temper During PAK vs BAN 1st Test
PAK vs BAN : పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. కాగా..ఈ మ్యాచ్ ఆఖరి రోజు చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన సహనాన్ని కోల్పోయాడు. తన చేతిలోని బంతిని పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ పైకి విసిరాడు. బంతి అతడికి తగలకపోవడంతో రిజ్వాన్‌కు ప్రమాదం తప్పింది.
అసలేం జరిగిందేంటే..?
ఓవర్‌నైట్ స్కోరు 23/1తో అయిదో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది పాకిస్తాన్. ఇక 33వ ఓవర్‌ను వేసేందుకు షకీబ్ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో రిజ్వాన్ క్రీజులో ఉన్నాడు. అయితే బంతిని ఎదుర్కొనేందుకు రిజ్వాన్ కాస్త సమయం తీసుకున్నాడు. అంతే.. షకీబ్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాడని భావించి తన చేతిలోని బంతిని వికెట్ కీపర్ వైపుగా విసిరివేశాడు.
MS Dhoni : ధోని భయ్యా.. అది క్రికెట్ బాల్ కాదు.. కాస్త చిన్నగా కొట్టవయ్యా..
ఆ బంతి రిజ్వాన్ తలపై నుంచి వెళ్లిపోయింది. దీన్ని చూసిన పాక్ బ్యాటర్లు, అంపైర్లతో పాటు బంగ్లా ఫీల్డర్లు ఆశ్చర్యపోయారు. దీనిపై అంపైర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తనదే అంటూ షకీబ్ ఆ వివాదానికి అక్కడితో ముగింపు పలికాడు. చూడాలి మరీ ఈ ఘటన పై అంపైర్ థర్డ్ అంపైర్‌కు ఫిర్యాదు చేస్తాడో లేదో. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అయితే.. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌ల్లో 565 పరుగులు చేసింది. దీంతో 117 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం బంగ్లాదేశ్‌కు లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ల్లో పాకిస్తాన్ 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్ ముందు 30 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. దీన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
Shakib ???? #PakistanCricket #PAKvBAN #ShakibAlHasan pic.twitter.com/sgBE5kRqYm
— Jack (@jackyu_17) August 25, 2024